ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా వీరభద్రుడి పల్లకీ ఉత్సవం

ABN, Publish Date - Jul 14 , 2025 | 11:26 PM

అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని భద్రకాళీ సమేత వీరభద్రాలయంలో సోమవారం స్వామి, అమ్మవార్ల పల్లకీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

వీరభద్రాలయంలో పల్లకీ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న ఆలయ సిబ్బంది

రాయచోటిటౌన, జూలై 14(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని భద్రకాళీ సమేత వీరభద్రాలయంలో సోమవారం స్వామి, అమ్మవార్ల పల్లకీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శంకరయ్య, కృష్ణయ్య స్వాములు వేదమంత్రాల మధ్య వీరద్రస్వామి, భద్రకాళీ అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వివిధ రకాల పుష్పాలు, పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ఉత్సవంపై ఏర్పాటు చేసి బ్యాండు మేళాలతో ఆలయం చుట్టూ మాఽఢవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ భక్తులతో పాటు కన్నడ భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. పల్లకీ ఉత్సవం అనంతరం అర్చకులు పల్లకీ ఉత్సవ విశిష్టత గురించి భక్తులకు వివరించి తీర్థప్రసాదాలను అందజేశారు.

Updated Date - Jul 14 , 2025 | 11:26 PM