ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తీరుమారదు.. శుభ్రత కనిపించదు

ABN, Publish Date - Jul 29 , 2025 | 12:02 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతినెలా మూడవ శనివారం నిర్వహిస్తు న్నా కొన్ని చోట్ల అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి.

ఖాజీపేట నుంచి కాశినాయన వెళ్లే రోడ్డు పక్కనే పేరుకుపోయిన చెత్తకుప్పలు

ఖాజీపేట, జూలై 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతినెలా మూడవ శనివారం నిర్వహిస్తు న్నా కొన్ని చోట్ల అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. గ్రామాలు, పట్ట ణాల్లో సైతం పరిశుభ్రత పెంపొందించాలని ప్రభుత్వం పేర్కొంటున్నా మరెం దుకో వాటిపై కొందరు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడం శోచనీయం ఖాజీపేట మండలంలోని ప్రతి పంచాయతీలో చెత్తనుంచి సంపద కేంద్రాలు ఏర్పాటు చేసి తడి, పొడి చెత్తలను సేకరించి హరిత రాయబారులు వాటిలో చేర్చాల్సి ఉంటుంది. అందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. అయితే రోడ్డు పక్కనే చెత్తకుప్పలు ఇష్టానుసారంగా కుప్పలుగా పేరుకుపోతున్నా పట్టించు కునే నాథుడే కరువయ్యారు. ఇదేమిటి రోడ్డు పక్కన చెత్త పడవేస్తే అంటువ్యాధులు రావా అని ప్రజలు సిబ్బందిని ప్రశ్నిస్తే మాకు తెలియదు, అధికారులు మాకు చెప్పారు ఎక్కడైనా వేస్తామంటూ సమాధానమిస్తుండడంతో అవాక్కవుతున్నారు. ఏది ఏమైనా ఇలా చెత్తకుప్పలు పెరిగితే వర్షాకాలంలో అవి కుళ్లి అంటు రోగాలు ప్రబలితే వ్యాధులు రావా అని ప్రజలు ప్రశ్నిస్తు న్నారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుని పారిశుధ్యాన్ని మెరు గుపరచాలని ప్రజలు కోరతున్నారు.

చెత్తను సేకరించి సంపద కేంద్రాలకు తరలిస్తాం

పారిశుధ్యాన్ని మెరుగుపరచే కార్యక్రమంలో భాగంగా ఇళ్ల నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను చెత్త సంపద కేంద్రాలకు తరలిస్తామన్నారు. ఎవరూ కూడా రోడ్డు పక్కన చెత్తను పడవేయరాదని అలాచేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

-శంకరమ్మ, పంచాయతీ కార్యదర్శి, ఖాజీపేట

Updated Date - Jul 29 , 2025 | 12:02 AM