జగన కల్లబొల్లి మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మరు
ABN, Publish Date - Jul 17 , 2025 | 11:59 PM
ప్రెస్‌మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ అవాక్కులు చవాక్కులు పేల్చుతున్న వైసీపీ నేత వైఎస్ జగనమోహనరెడ్డి మాటలను ప్రజలు నమ్మరని, 151 నుంచి 11 సీట్లకు పడేసినా అతనికి సిగ్గు లేదని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిది మేడా విజయశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్‌రెడ్డి
రాజంపేట, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : ప్రెస్‌మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ అవాక్కులు చవాక్కులు పేల్చుతున్న వైసీపీ నేత వైఎస్ జగనమోహనరెడ్డి మాటలను ప్రజలు నమ్మరని, 151 నుంచి 11 సీట్లకు పడేసినా అతనికి సిగ్గు లేదని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిది మేడా విజయశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం రాజంపేటలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లడుతూ తన ఐదేళ్ల పాలనలో లక్ష కోట్ల మద్యం స్కాంతో పాటు ఇసుక మాఫియా, మట్టి మాఫియా ఇలా అన్నిరకాల మాఫియాలు చేసి రాష్ట్రాన్ని లూటీ చేశారన్నారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేసినా బుద్ధి రాలేదన్నారు. జగన మాయమాటలు ఎవరూ నమ్మరని, ఎంపీ మిథునరెడ్డి, ఇతర నేతల బెదిరింపులకు ఇక్కడ బెదిరేవారు ఎవరూ లేరన్నారు. జగనను ఎక్కడైనా ఎప్పుడైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వైసీపీ నేతల అంతు తేల్చడానికి సిద్ధమేనన్నారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్పొరేట్ మాజీ డైరెక్టర్ కొమరా వెంకటనరసయ్య, నాగిరెడ్డిపల్లె సర్పంచ జంబు సూర్యనారాయణ, ముద్దా ఆదిశేషారెడ్డి, లేబాక నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 17 , 2025 | 11:59 PM