ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN, Publish Date - Jul 25 , 2025 | 11:59 PM

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి పేర్కొన్నారు.

14వ వార్డులో ఇంటింటికి వెళ్లి మాట్లాడుతున్న శ్రీనివాసరెడ్డి, భూపేశ్‌రెడ్డి

జమ్మలమడుగు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జమ్మలమడుగు పట్టణంలోని 14వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టారు. వారు ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలు అందించి స్థానికులతో మాట్లాడారు. వెళ్లిన ప్రతి ఇంటిలో సబ్సిడీ సిలిండర్‌ వచ్చిందని, ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి వందనం పడిందని మరికొందరు 1వ తేదీ పింఛన్‌ డబ్బులు ఇంటి వద్దకు తెచ్చి అందిస్తున్నారని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటిన్లు ప్రారంభించామని, రోడ్లు వేయడం, ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పరిశీలకుడు రామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిది పొన్నతోట శ్రీనివాసులు, క్లస్టర్‌, యూనిట్‌ బూత్‌ ఇన్‌చార్జిలు, 14వ వార్డు టీడీపీ నాయకులు బిర్రు సంతోష్‌, జైపాల్‌, దువ్వూరి మురళి పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 11:59 PM