ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అర్హులకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం

ABN, Publish Date - Jul 06 , 2025 | 11:57 PM

నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందిం చడమే ముఖ్యమంత్రి చంద్రబాబునా యుడు లక్ష్యంగా పెట్టుకున్నారని బద్వే లు టీడీపీ ఇనచార్జి రితీష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇల్లు కావాలని రితీష్‌రెడ్డికి తెలుపుతున్న వృద్ధురాలు వెంగల సుబ్బమ్మ

బి.కోడూరు, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందిం చడమే ముఖ్యమంత్రి చంద్రబాబునా యుడు లక్ష్యంగా పెట్టుకున్నారని బద్వే లు టీడీపీ ఇనచార్జి రితీష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలిఅడు గు కార్యక్రమంలో భాగంగా బి.కోడూరు మండల పరిఽధిలోని గోవిందాయపల్లె గ్రామంలో ఆదివారం ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజల యోగక్షేమాలతో పాటు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంగల సుబ్బమ్మ అనే మహిళ ఇల్లు లేదని ఆయన దృష్టికి తీసుకురాగా, అప్పటికప్పుడు హౌసింగ్‌ డీఈతో మాట్లాడి ఆమెకు వెం టనే ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే గ్రామంలో వెంగల పిచ్చిరెడ్డి విద్యుత స్తంభం ఏర్పాటు చేయాలని కోరగా వెంటనే ఆయన విద్యుత ఏఈ చిన్నయ్యకు సూచించడంతో ఆయన విద్యుత స్తంభాన్ని ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీసీ బ్యాంకు ఛైర్మన సూర్యనారా యణరెడ్డి, కూటమి నేత బొజ్జ రోశన్న, రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షుడు రమణారెడ్డి, మండల పార్ల్టీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి, సర్పంచ గురయ్య, గోడి రమణారెడ్డి , అమర్‌నాధరెడ్డి, దుగ్గిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, రామసుబ్బారెడ్డి, రాఘవరెడ్డి, రామ్మో హనరెడ్డి, బాలయ్య, పవన, నారాయణరెడ్డి, మద్దిరెడ్డి, నరసింహులు పాల్గొన్నారు.

కాశినాయనలో: బద్వేల్‌ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కె.విజయమ్మ, పార్టీ సమన్వయకర్త కె.రితేష్‌రెడ్డి ఆదేశాలమేరకు ఆదివారం మండలంలోని కోడిగుడ్లపాడులో సర్పంచ సోమే సుల బాలగురయ్య, యూనిట్‌ ఇనచార్జి లక్కిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో సుపరి పాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం, సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ కార్యకర్తలు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

ఎర్రగుంట్లలో: ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వంలోనే సుప రిపాలన జరుగుతోందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని ఆదివారం ఎర్రగుంట్లలోని క్రిష్టియనలైనలో నిర్వహించి చంద్రబాబు పాలనా దక్షతతో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళుతోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బయ్యపురెడ్డి, వెంకటేష్‌, విజయేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 11:57 PM