వరుణుడి కోసం రైతన్న చూపు
ABN, Publish Date - Jun 29 , 2025 | 11:22 PM
ఖరీఫ్ సీజన ప్రారంభమె ౖన వర్షాలు కురవకపోవడంతో రైతున్నలు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు.
జమ్మలమడుగు, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన ప్రారంభమె ౖన వర్షాలు కురవకపోవడంతో రైతున్నలు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. మే నెలలో కురిసిన వర్షాలు ప్రస్తుత జూన నెలలో మొఖం చాటేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్ప టికే విత్తనం విత్తడానికి సంసిద్ధంగా ఉన్న రైతన్న ఎప్పుడు వర్షం వస్తుంది.. ఎప్పుడు విత్తనం విత్తాలంటూ దీర్ఘాలోచనలో పడ్డారు. జమ్మలమడుగు మండలంలోని అన్ని గ్రామాల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పొలాల్లో పంట సాగు చేయడానికి పొలాలను సిద్ధం చేశారు. మరికొందరు కంపచెట్లు, ఇతర వ్యర్థాలు తొలగించి శుభ్రం చేస్తున్నారు. మరికొందరు రైతులు ఇప్పటికే వరిసాగు చేయడానికి నారు సిద్ధం చేసుకున్నారు. మండలంలోని ధర్మాపురం, గొరిగెనూరు, సలివెందుల, పెద్దదండ్లూరు, దేవగుడి, పి.బొమ్మేపల్లె, అంబవరం, పి.సుగుమంచిపలె ్ల గ్రామాల్లో రైతులు వరి అధికంగా సాగు చేస్తారు. ఈసారి రుతుపవనాలు ముందుగా వచ్చినప్పటికి జూన్ నెలలో మందగించి వర్షం కురవలేదు. దీంతో పంట సాగు చేయడానికి వర్షం కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. కనీసం బోర్లు, బావుల కింద పంటలు సాగు చేద్దామన్న వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోతే వరికి తగినమేర నీరందించలేక నష్టపోవాల్సి వస్తుందేమోనని మదనపడుతున్నారు. ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌లో రైతులు పంట సాగు చేయడానికి పెట్టుబడి సాయం అందించాలని పలువురు రైతులు కోరుతున్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల వద్ద నుంచి సిద ్ధంగా పెట్టినప్పటికి కొందరు రైతులకు డబ్బులు లేక వ్యవసాయంవైపు మక్కువ చూపకుండా ఆలస్యం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఎరువులు, విత్తనాల వ్యాపారులు రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని వాటి పై విజిలెన్స్ తనిఖీలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
Updated Date - Jun 29 , 2025 | 11:22 PM