మహానాడుకు తరలివెళ్లిన టీడీపీ నేతలు
ABN, Publish Date - May 28 , 2025 | 12:02 AM
కడపలో మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజుల పాటు జరుగుతున్న టీడీపీ మహా నాడుకు పోరుమామిళ్ల మండలం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్త లు వాహనాల్లో భారీగా తరలివెళ్లా రు.
పోరుమామిళ్ల, మే 27 (ఆంధ్రజ్యో తి): కడపలో మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజుల పాటు జరుగుతున్న టీడీపీ మహా నాడుకు పోరుమామిళ్ల మండలం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్త లు వాహనాల్లో భారీగా తరలివెళ్లా రు. పోరుమామళ్ల మేజరు పంచాయ తీ సర్పంచ యనమల సుధాకర్, టీడీపీ మండల అధ్యక్షుడు నగరిభైరవ ప్రసాద్, మైనార్టీ సెల్ కార్యనిర్వాహక కార్య వర్గసభ్యురాలు హబీబున్నీసా, ఇమాంహుసేన, టీడీపీ నాయకుడు కొండా రామక్రిష్ణా రెడ్డి, ఎంపీటీసీ కల్వకూరి రమణ, మండల తెలుగుయువత అఽధ్యక్షుడు సీతాబాలాజీ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు సీతా వెంకటసుబ్బయ్య, సీతాసురేశ, తోట బ్రహ్మయ్య తదిత రులు వాహనాల్లో తరలివెళ్లారు.
మైలవరంలో: కడపలో మంగళవారం ప్రారంభమైన మహానాడుకు మైలవరం టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా వాహనాల్లో తరలివెళ్లారు. మండలంలోని అన్ని పంచాయతీల నుంచి వాహనాల్లో భారీగా జనాలు తరలివెళ్లారు. మండల ఎంపీపీ భర్త చెన్నకేశవరెడ్డి, గొల్లపల్లె హుస్సేన్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కొండయ్య, వద్దిరాలకు చెందిన సూర్యపెద్దిరాజు, చిన్నకొమెర్ల రామాంజనేయులరెడ్డి, మైలవరం, రామచంద్రాయపల్లె, పెద్దకొమెర్ల, నవాబుపేట, చిన్నకొమెర్ల, కల్లుట్ల, తదితర పంచాయతీల నుంచి మహానాడుకు భారీగా తరలి వెళ్లారు.
అట్లూరులో: అట్లూరు మండలం నుం చి కడపలో నిర్వహిస్తున్న మహానాడు కు 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నా య కులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్లారు. జై తెలుగుదేశం అం టూ నినాదాలు చేశారు. డీసీసీబ్యాంకు ఛైర్మన సూర్యనారాయణరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు మల్లిఖార్జునరెడ్డి, మం డల నాయకులు అరవ శ్రీనివాసులరెడ్డి, నంద గోపాల్‌రెడ్డి, అమర్‌నాధరెడ్డి, పెతిరెడ్డి రెడ్డయ్య, పాలకొండు రామచంద్రారెడ్డి, అల్లం వెంకట సుబ్బయ్య, ఎల్.రామక్రిష్ణారెడ్డి, రాధాక్రిష్ణారెడ్డి, చిలిపి క్రిష్ణారెడ్డి, సాంబ శివారెడ్డి, మునిరెడ్డి, బ్రహ్మారెడ్డి, జయక్రిష్ణారెడ్డి, కడప టీడీపీ మహిళా అద్యక్షురాలు పార్లమెంటరీ మహి ళా అధ్యక్షురాలు సుధారాణి, టీడీపీ కార్యకర్తలు తదితరులు పెద్దఎత్తున తరలి వెళ్లారు.
కొండాపురంలో: కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి మండలం లోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. టీడీపీ ఇనచార్జి భూపేశరెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ సొంత వాహనాల్లో తరలివెళ్లారు. చివరిరోజైన గురువారం నాడు ఇంకా పెద్దసంఖ్యలో వెళ్లనున్పట్లు టీడీపీ నాయకులు తెలిపారు.
Updated Date - May 28 , 2025 | 12:02 AM