మహానాడులో సందడి చేసిన టీడీపీ నాయకులు
ABN, Publish Date - May 29 , 2025 | 12:19 AM
కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో బుధవారం దువ్వూరు మండలం నుంచి పలువురు నాయకులు పాల్గొని సందడి చేశారు.
దువ్వూరు, మే 28 (ఆంధ్రజ్యోతి): కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో బుధవారం దువ్వూరు మండలం నుంచి పలువురు నాయకులు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా వారికి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిశారు. తెలుగుదేశం పార్టీకి ఏకపక్షమైన ఓటర్లు కలిగిన రామాపురం గ్రామం నుంచి రఘునాథనాయుడుతోపాటు ఆ ప్రాంత మాజీ ఎంపీటీసీ లక్షుమయ్య వారి అనుచరులు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే ఎరుపతినేని శ్రీనివాసరావులను కలిశారు. మండల కన్వీనర్ రమణారెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు కోనేటి హరి వారి అనుచరులతో మహానాడు కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ను కలిశారు. దువ్వూరుకు చెందిన ఆ పార్టీ నాయకుడు మహబూబ్‌షరీఫ్, వారి అనుచరులు, రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకుడు పట్టాభితో కలిసి ముచ్చటించారు.
ఖాజీపేటలో: మహానాడు కార్యక్రమానికి మండల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. బుధవారం మహానాడు రెండవ రోజు సందర్భంగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ పిలుపుమేరకు మండల పరిధి నుంచి భారీగా తరలి వెళ్లారు. ప్రతి పంచాయతీ నుంచి బస్సు బయల్దేరేందుకు స్థానిక నాయకులు సన్నాహాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండలాధ్యక్షుడు లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ మండల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా కడపలో జరిగే మహానాడుకు తరలివెళ్లారన్నారు.
కలసపాడులో: కడపలో జరుగుతు న్న మహానాడు రెండవ రోజు కార్యక్ర మంలో బుధవారం కలసపాడు మం డలానికి చెందిన పలువురు నాయకు లు, కార్యకర్తలు పాల్గొని మంత్రులు, టీడీపీ రాష్ట్ర నేతలను, ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు బాలిరెడ్డి, రమణారెడ్డి, నారాయణరెడ్డి, చిన్నపుల్లారెడ్డి, భూపాల్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 30 , 2025 | 03:04 PM