మంత్రి నారాయణతో టీడీపీ నేతల భేటీ
ABN, Publish Date - Jul 05 , 2025 | 11:21 PM
పురపాలక శాఖ మంత్రి నారాయణతో రాజంపేటకు చెందిన నాయకులు శనివారం భేటీ అయ్యారు.
మంత్రి నారాయణను సత్కరించిన కుమార్, కేకేచౌదరి
రాజంపేట, జూలై 5 (ఆంధ్రజ్యోతి): పురపాలక శాఖ మంత్రి నారాయణతో రాజంపేటకు చెందిన నాయకులు శనివారం భేటీ అయ్యారు. బీసీ సంఘ రాష్ట్ర కార్యదర్శి ఇడిమడకల కుమార్, ఖాదీ బోర్డు రాష్ట్ర చైర్మన కేకే చౌదరీలను నెల్లూ రు పట్టణ అసెంబ్లీని యోజకవర్గ సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా నియమించడంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మంత్రి నారాయణతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నారాయణను సత్కరించి ఆ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రాజంపేట నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు.
Updated Date - Jul 05 , 2025 | 11:21 PM