దౌర్జన్యం చేస్తున్న గ్యాంగ్‌పై చర్యలు తీసుకోండి
ABN, Publish Date - May 19 , 2025 | 11:30 PM
రూ.మూడున్నర కోట్లకు పైగా పలువురి దగ్గర అప్పులు తీసుకొని అప్పు ఇచ్చిన వారిపైనే దౌర్జన్యానికి పాల్పడుతూ బెదిరింపులకు గురి చేస్తున్న గ్యాంగ్‌పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ మదనపల్లికి చెందిన సుమారు 30 మందికి పైగా బాధితులు ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుకు తమ గోడును విన్నవించారు.
ఎస్పీకి మదనపల్లె బాధితుల వేడుకోలు
రాయచోటిటౌన్, మే 19 (ఆంధ్రజ్యోతి): రూ.మూడున్నర కోట్లకు పైగా పలువురి దగ్గర అప్పులు తీసుకొని అప్పు ఇచ్చిన వారిపైనే దౌర్జన్యానికి పాల్పడుతూ బెదిరింపులకు గురి చేస్తున్న గ్యాంగ్‌పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ మదనపల్లికి చెందిన సుమారు 30 మందికి పైగా బాధితులు ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుకు తమ గోడును విన్నవించారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని మదనపల్లి పట్టణానికి చెందిన రమేశ్ భార్య కందుల సుజాత.. ఆమె కుమారుడు కందుల సునీల్, నరేంద్ర భార్య సుంకర లావణ్య, పద్మప్రియ, గౌరీ, నాగరత్న, నలిని, నాగమణి తదితరులతో కలిసి పట్టణంలో ఉండే ఒంటరి మహిళలను, ఫ్యామిలీలను, వృద్ధులను టార్గెట్ చేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, పిల్లలకు ఫీజు కట్టాలని నమ్మబలికి వారి వద్ద నుంచి అప్పు తీసుకుంటూ ఉండేది. ఇలా 30 మందికి పైగా మూడున్నర కోట్ల వరకు సుజాత అప్పు తీసుకుందన్నారు. అప్పు ఇచ్చిన వారు డబ్బులు అడిగితే పైన కనబరిచిన గ్యాంగ్‌తో వారి ఇంటి వద్దకు వెళ్లి వారిని నానా రకాలుగా దూషించడంతో పాటు భయభ్రాంతులకు గురిచేసి అవమానకరంగా మాట్లాడుతోందని వాపోయారు. సుజాత గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడుతుండటంతో భరించలేక సమస్యను కోర్టుకు వేశామని, అయితే తమపైనే కోర్టులో వేస్తారా అంటూ మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. అదేవిధంగా ఏకాంబర్‌రెడ్డి అనే అతని వద్ద రూ.60 లక్షలు అప్పు తీసుకుని వారి ఇంట్లో ఉంటూ బాడుగ అడిగినందుకు మదనపల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఆయనపై రేప్ కేసు పెట్టిందని మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అందరి దగ్గర అప్పులు తీసుకొని ఆమె దుబాయ్ వెళ్లిపోయిందని, పులివెందులలో కూడా ఆమెపై కేసు ఉందని వారు వివరించారు. జిల్లా పోలీసులు విచారించి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
Updated Date - May 19 , 2025 | 11:30 PM