ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంటి స్థలం కబ్జాపై చర్యలు తీసుకోండి

ABN, Publish Date - May 16 , 2025 | 11:57 PM

సైనికుడిగా పనిచేసి రిటైర్‌ అయిన డబ్బులతో సొంత ఇంటి నిర్మాణంకోసం కొత్తపల్లె పంచాయతీ లోని సర్వేనెంబరు 509/1లో 8 సెంట్లు స్ధలం కొనుగోలు చేయగా కొందరు స్థలం కబ్జా చేసి ఇబ్బందులు పెడుతున్నారని మాజీ సైని కుడు పేట్ల రవికుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

తహసీల్దారుకు వినతి పత్రం ఇస్తున్న మాజీ సైనికుడు పేట్ల రవికుమార్‌

తహసీల్దారుకు మాజీ సైనికుడి వినతి

ప్రొద్దుటూరు , మే 16 (ఆంధ్ర జ్యోతి) : సైనికుడిగా పనిచేసి రిటైర్‌ అయిన డబ్బులతో సొంత ఇంటి నిర్మాణంకోసం కొత్తపల్లె పంచాయతీ లోని సర్వేనెంబరు 509/1లో 8 సెంట్లు స్ధలం కొనుగోలు చేయగా కొందరు స్థలం కబ్జా చేసి ఇబ్బందులు పెడుతున్నారని మాజీ సైని కుడు పేట్ల రవికుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్ధానిక తహసీల్దారు గంగయ్యకు మాజీ సైనికుడి కుటుంబం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇంటి స్ధలం కొన్నాక హద్దులు పాతుకొని ఉండగా జరీనా బేగం అనే మహిళ 56 సెంట్ల మొత్తం స్ధలం మాదని ఇది మాజీ ఎమ్మెల్యే కుమారుడు కు విక్రయించామని తెలిపిందన్నారు. స్ధలం అమ్మిన వారిని నిలదీయగా వారు ఇది పెద్దల చేతుల్లోకి పోయిందని తామేమి చేయలేమని మమ్ముల్ను వారు మోసం చేశారని ఇలా కబ్జా చేస్తున్న వారిపై విచారించి చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని తహసీల్దారును కోరారు. తహసీల్దారుకు వారు కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు అందజే శారు. ఇందుకు తహసీల్దారు విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - May 16 , 2025 | 11:57 PM