తోతాపూరి మామిడికి కిలోకు రూ.4 మద్దతు ధర
ABN, Publish Date - Jun 18 , 2025 | 11:22 PM
తోతాపూరి జ్యూస్ కాయలకు ప్రభుత్వం కిలోకు రూ.4 మద్దతు ధర ఇచ్చినట్లు రైల్వేకోడూరు ఉద్యాన శాఖ అధికారి ఎం.వెంకటభాస్కర్ తెలిపారు.
కోడూరు ఉద్యాన శాఖాధికారి వెంకటభాస్కర్
రైల్వేకోడూరు, జూన 18(ఆంధ్రజ్యోతి): తోతాపూరి జ్యూస్ కాయలకు ప్రభుత్వం కిలోకు రూ.4 మద్దతు ధర ఇచ్చినట్లు రైల్వేకోడూరు ఉద్యాన శాఖ అధికారి ఎం.వెంకటభాస్కర్ తెలిపారు. బుధవారం ఆయన రైల్వేకోడూరు మామిడి యార్డును పరిశీలించి రైతు సేవా కేంద్రాల సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ రైతులు మండీల ద్వారాగాని, ఎఫ్‌పీఓల ద్వా రా గాని విక్రయించినప్పుడు తమ పేర్లను పర్మిట్‌లో న మోదు చేసుకుని గుజ్జు పరిశ్రమలకు తీసుకెళ్లాలన్నారు. గుజ్జు పరిశ్రమల వద్దకు కాయలను తీసుకుని వెళితే అక్కడ తమ సిబ్బంది ఉంటారని, వారికి 1-బీ, ఆధార్‌లింకు కలిగిన బ్యాంకు అకౌంట్ నెంబర్ ఉన్న పత్రాలను ఇచ్చి తమ పేర్ల నమోదు చేసుకోవాలన్నారు. పక్వానికి వచ్చిన కాయలను మాత్రమే కోసి గుజ్జు పరిశ్రమలకు తరలించాల న్నారు. తోతాపూరి మామిడి రకానికి ఇచ్చే మద్దతు ధర రూ.4లు నేరుగా రైతు బ్యాంకు ఖాతాలోకి జమ అవుతుందన్నారు. గుజ్జు, జ్యూస్ పరిశ్రమల వారు కొన్న ధరను నేరుగా రైతుకు చెల్లిస్తారన్నా రు. వివరాల కోసం రైతు సేవా కేంద్రం సిబ్బంది లేదా ఉద్యాన అధికారులను సంప్రందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, మండీల వ్యాపారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సుండుపల్లె: మామిడి కేజీపై రూ.4 అదనంగా ఇస్తుందని ఉద్యానశాఖ అధికారిణి వనితాభాయి తెలిపారు. బుధవారం మండలంలోని మామిడికాయల మండీలను ఆమె పరిశీలించారు. ప్రతి రైతూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
Updated Date - Jun 18 , 2025 | 11:23 PM