ప్రభుత్వ భూముల జోలికివస్తే కఠినచర్యలు
ABN, Publish Date - Apr 29 , 2025 | 11:34 PM
ఎవరైనా ఏస్థాయి లో ఉన్నవారైనా ప్రభుత్వ భూముల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన హెచ్చ రించారు.
జలకళ బోర్లపై విచారణ నాయనపల్లె కొండపొరంబోకు భూముల్లో అక్రమ కరెంట్ సర్వీసుల గుర్తింపు
కాశినాయన ఏప్రిల్29(ఆంధ్రజ్యోతి): ఎవరైనా ఏస్థాయి లో ఉన్నవారైనా ప్రభుత్వ భూముల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన హెచ్చ రించారు. .మంగళవారం నర్సాపురం తహసీల్దారు కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన విలేకరుల తో మాట్లాడుతూ నాయనపల్లె కొండ పొరంబోకు భూముల ఆక్రమణపై విచారణ వేగవంతంగా సాగుతోందన్నారు. 40 బ్లాకులుగా విభజించి విచా రణ చేస్తున్నామని దాదాపు 294 ఎకరాలు ఆక్రమిం చినట్లు నిర్థారణకు వచ్చామన్నారు. ఇక్కడ సాగుచేస్తున్న వారికి ఎలాంటి రికార్డులు లేవని కొంతమంది ఆర్మీ పట్టాలు ఉన్నాయని, పాతపట్టాలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్న ట్లు తెలిసిందని అదంతా ఉత్తదేనన్నారు. జలకళ బోర్లు నాయనపల్లె ప్రభుత్వ భూముల్లో వేసినట్లు గుర్తించామని అవి ఎక్కడ మంజూరయ్యాయి ఎక్కడ తవ్వించారు అన్న విషయాలను సమగ్రంగా తేలుస్తామన్నారు. రెండు కరెంట్ సర్వీసులు మంజూరు చేయించుకొని 19 మోటార్లు నడు స్తున్నట్లు ట్రాన్సకో అధికారులు తెలి పారన్నారు. వాటన్నిం టికి ఎవరెవరు సహకరించారు అన్న విషయాలపై ఆరాతీసు ్తన్నామని సమగ్ర వివరాలతో త్వరలో కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామన్నారు. ఈకార్యక్ర మంలో తహసీల్దారు వెంకటసుబ్బ య్య, డీటీ రవిశంకర్ ఆర్‌ఐ అమర్‌నాద్‌రెడ్డి, గ్రామ సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 29 , 2025 | 11:34 PM