తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి
ABN, Publish Date - Apr 26 , 2025 | 11:41 PM
గ్రామాల్లో తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎంపీపీ ఆవుల నాగశ్రీలక్ష్మి తెలిపారు.
సంబేపల్లె, ఏప్రిల్26(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎంపీపీ ఆవుల నాగశ్రీలక్ష్మి తెలిపారు. శనివారం ఎంపీడీవో సభా కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగశ్రీలక్ష్మి మాట్లాడుతూ మే, జూన నెలలో నీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. ప్రస్తుతం ఒక్కో ట్యాంకర్‌కు రూ.515 చెల్లిస్తున్నట్లు ఆర్‌డబ్ల్యుఎస్ జేఈ మహేశ్వరి తెలిపారు. రూ.515 గిట్టుబాటు కాక ట్యాంకర్ల ద్వారా నీరు తోలడానికి ఎవరూ ముందుకు రానట్లు సర్పంచులు, ఎంపీటీసీలు తెలియజేశారు. ట్యాంకర్ల వాళ్లకు గిట్టుబాటు కాని విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. మోడల్ స్కూల్‌లో భవనాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, త్వరగా పనులు చేయాలని మినిటల్స్ బుక్‌లో నమోదు చేశారు. సమావేఽశంలో తదితర శాఖలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గొర్ల కవిత, తహసీల్దార్ సుబ్రమణ్యంరెడ్డి, ఎంపీడీవో రామచంద్ర, ఉప మండల అధ్యక్షులు రవీంద్రనాయుడు, మీసాల భాగ్యమ్మ, సర్పంచులు, ఎంపీటీసీలు, అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - Apr 26 , 2025 | 11:41 PM