ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఒరిగిన స్తంభాలను సరి చేయరా..?

ABN, Publish Date - Jun 23 , 2025 | 11:37 PM

ఖరీఫ్‌ సీజన ప్రారంభం కావడంతో రైతులు పంటల సాగుకు సన్నద్ధమవుతున్న తరుణంలో పొలాల్లో ఒరిగిన విద్యుత స్తంభాలను సరిచేయకపోవడం దారుణం.

పెద్దశెట్టిపల్లి-శంకరాపురం గ్రామాల మధ్యలో ఒరిగిన స్తంభాలు

ప్రొద్దుటూరు రూరల్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి):ఖరీఫ్‌ సీజన ప్రారంభం కావడంతో రైతులు పంటల సాగుకు సన్నద్ధమవుతున్న తరుణంలో పొలాల్లో ఒరిగిన విద్యుత స్తంభాలను సరిచేయకపోవడం దారుణం. అసలే గాలీవాన వీస్తుండడంతో స్తంభాలు ఎక్కడ కిందపడుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలు జరిగే వరకు పట్టించుకోరా అంటూ మండిప డుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరు మండల పరిధిలోని పలు గ్రామాలకు విద్యుత సరఫరా చేసే స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా మారాయి. ఇటీవల వీచిన గాలుల ధాటికి విద్యుత స్తంభాలు ఒకవైపునకు ఒరిగిపోయాయి. ఇందులో శంకరాపురం, పెద్దశెట్టిపల్లె ప్రధాన రహదారిలో ఒకవైపు స్తంభాలన్నీ వాలిపోవడంతో విద్యుత తీగెలు రోడ్డు వెంబడి ఉన్న చెట్లకు తగులుతున్నాయి. కాగా విద్యుత శాఖ అధికారులు స్తంభాలను సరిచేయకుండా రోడ్డుకు పక్కనున్న చెట్లను తొలగిస్తూ మమ అని చేతులు దులుపు కుంటున్నారని పలువురు వాపోతున్నారు. చౌడూరు, కాకిరేణిపల్లె గ్రామంలో కాకిరేణిపల్లెకు విద్యుత సరఫరా చేసే స్తంభాలు పొలాల మధ్యలో ఒరిగిపోయాయి. దీంతో తక్కువ ఎత్తులో విద్యుత వైర్లు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికే పొలాల్లో దుక్కులు దున్ని వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్న రైతన్నలు ఈ ప్రాంతాల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం తప్పదు. కొద్దిపాటి గాలులకు, వర్షానికి గ్రామాల్లో రాత్రంతా విద్యుత సరఫరా నిలిచిపోతోందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికౌనా ంంబంధిత విద్యుత శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jun 23 , 2025 | 11:37 PM