ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చిన్నేపల్లెలో ఐదో తరగతి వరకు కొనసాగించాలి

ABN, Publish Date - Jul 15 , 2025 | 11:54 PM

అట్లూరు మండలంలోని చిన్నేప ల్లె పాఠశాలను ఐదో తరగతి వరకు కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.

పాఠశాల తరగతుల విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న డీఈవో

విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్‌

ప్రభుత్వానికి నివేదికలు పంపామన్న డీఈవో

అట్లూరు, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : అట్లూరు మండలంలోని చిన్నేప ల్లె పాఠశాలను ఐదో తరగతి వరకు కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. పాఠశాలల మ్యాపింగ్‌లో భాగంగా విద్యాశాఖాధికారులు ఇటీవల ఎస్‌. వెంకటాపురం పాఠశాలకు 3,4,5 తరగతుల విద్యార్థులను విలీనం చేశారు. దీంతో చిన్నేపల్లెలోనే పాఠ శాలను యథావిధిగా ఉంచాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా ఈ విషయంపై మంగళవారం డీఈవో షంషుద్దీన చిన్నేపలె ్లపాఠశాలను పరిశీలించి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఎఉస్‌.వెంకటాపురం పాఠశాలకు మా పిల్లలను వెళ్లబోరని, కనీసం తల్లిదండ్రులకు పాఠశాల విద్యాకమిటీలకు సమాచారం ఇవ్వకుండా మండల విద్యాశాకాధికారులు విలీనం చేశారని, డీఈవో ఎదుట వాపోయారు. దీనిపై డీఈవో షంషుద్దీన మాట్లాడుతూ మీ సమస్యలపై ప్రభుత్వానికి నివేదికలు పంపామని, స్కూల్సు రిపోర్టు జాయింట్‌ కలెక్టర్‌కు పంపించామని, త్వరలోనే పరిష్కారం ఉంటుం దని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఎస్‌.వెంకటాపురం పాఠశాల వసతులు సక్రమం గా లేకపోయినా మోడల్‌ స్కూలుకు ఎలా ప్రకటించారంటూ స్థానిక ఎంఈవో విలియంరాజు, ఖాదర్‌వల్లిని డీఈవో ప్రశ్నించారు. అలాగే బెడుసుపల్లె, మలినేనిపట్నం స్కూళ్లను పరిశీలించారు. స్కూలు కిలోమీటరు దూరం ఉండడంపై తమ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని డీఈవో ఎదుట తల్లిదండ్రులు వాపోయారు. సమస్య పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 11:54 PM