ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డీసీఎస్‌ఆర్‌ కాలనీలో పారిశుధ్య చర్యలు

ABN, Publish Date - Mar 21 , 2025 | 11:42 PM

ప్రొద్దుటూరు మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీ పరిధిలో ఉన్న డీసీఎస్‌ఆర్‌ కాలనీలో పారిశుధ్య సిబ్బంది దోమల నివారణకోసం చర్యలు చేపట్టారు.

మురుగునీటిలో ఆయిల్‌బాల్స్‌ వదులుతున్న సిబ్బంది

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

ప్రొద్దుటూరు రూరల్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ప్రొద్దుటూరు మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీ పరిధిలో ఉన్న డీసీఎస్‌ఆర్‌ కాలనీలో పారిశుధ్య సిబ్బంది దోమల నివారణకోసం చర్యలు చేపట్టారు. మండల పరిధిలోని కొత్తపల్లి, గోపవరం పంచాయతీల్లో జనావాసాల మధ్య పేరుకుపోతున్న మురుగు తటాకాలు, వాటి ద్వారా ప్రభలుతున్న దోమల వ్యాప్తిపై ఈనెల 20న ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ‘ఇలాగైతే పుట్టనా... కసితీరా కుట్టనా..!’ కథనం ప్రచురితం అయింది. దీంతో స్పందించిన పంచాయతీ పారిశుధ్య యంత్రాంగం దోమల నివారణ కోసంస్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించినట్లు పంచాయతీ కార్యదర్శి రామమోహన్‌ తెలిపారు. వీధి వీధినా ఫాగింగ్‌ చర్యలు చేపట్టి, దోమల లార్వా నివారణకోసం ఆయిల్‌బాల్స్‌ను వదిలినట్లు చెప్పారు. గోపవరం పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తమ పరిధిలోని మురుగు తటాకాల నిర్మూలనకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

Updated Date - Mar 21 , 2025 | 11:42 PM