ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘ప్రతి నెలా మొద టి వారంలోనే జీతాలు చెల్లించాలి’

ABN, Publish Date - Jul 24 , 2025 | 11:23 PM

గాలివీడు మండలం తూ ముకుంట గ్రామం టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ పీ4, పీ5లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు ప్రతి నెలా మొద టి వారంలోనే జీతాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంశివ, సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

నిరసన తెలుపుతున్న సీఐటీయూ, సీపీఐ నాయకులు

గాలివీడు, జూలై24(ఆంధ్రజ్యోతి): గాలివీడు మండలం తూ ముకుంట గ్రామం టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ పీ4, పీ5లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు ప్రతి నెలా మొద టి వారంలోనే జీతాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంశివ, సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. గురువారం సెక్యూరిటీ గార్డుల నిరసనకు ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ పీ4, పీ5లో పనిచేస్తున్న దాదాపు 38 మంది సెక్యూరిటీ గార్డులకు నేటికీ 24 రోజులు గడిచినా ఇంతవరకు వేతనాలు చెల్లించడంలో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. సెక్యూరిటీ గార్డులకు సకాలంలో వేతనాలు చెల్లించని కాంట్రాక్టు సంస్థను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని కోరారు. సోలార్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సెక్యూరిటీ గార్డులకు సోలార్‌ ప్రాజెక్టు వద్ద భద్రతా పరికరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే కాంట్రాక్టర్‌ స్పందించి సెక్యూరిటీ గార్డులకు వేతనాలు చెల్లించాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ముబారక్‌, సెక్యూరిటీ గార్డులు పుల్లయ్య, శబరీశ, నాగరాజు, హేమకుమార్‌, రవీంద్ర, రమేశనాయక్‌, రమణ, సుధాకర్‌, నరేంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 11:23 PM