ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సా..గని రోడ్డు విస్తరణ పనులు

ABN, Publish Date - Jul 15 , 2025 | 11:51 PM

పోరుమామిళ్ల పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు ముందుకు సాగడంలేదు.

రోడ్డుకు ఇరువైపుల విస్తరణ పనులు ఆగిపోయిన దృశ్యం

పోరుమామిళ్ల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): పోరుమామిళ్ల పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు ముందుకు సాగడంలేదు. గత వైసీపీ హయాంలో పోరుమామిళ్లలో 80 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ పనులు నిధులు కేటాయించి సెంటర్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసి ఆధునీకరిస్తామని దాదాపు రూ.20కోట్లు కేటాయించారు. అయితే సకాలంలో బిల్లులు అందకపోవడం, అంచనాల ప్రకారం నిర్మాణాలు చేపట్టక కొన్నేళ్లు నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచాయి. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక నాయకులు కాం ట్రాక్టర్లను పనులు చేయడానికి ఒప్పించడం, పెండింగు బిల్లులు రావడంతో తిరిగి పనులు ప్రారంభించారు. రోడ్డుకిరువైపులా మొత్తం ఐదు అడుగుల వెడల్పుతో డ్రైనేజీ కాల్వలు, 8 అడుగుల వెడల్పుతో ప్లాట్‌పారం 48 అడు గుల వెడల్పుతో రోడ్డు, మిగిలిన స్థలంలో డివైడర్ల నిర్మాణాలు చేపట్టేందుకు పనులు ప్రారంభించారు. కానీ నెల తిరగకుండానే ఆటంకాలు ప్రారంభమ య్యాయని చెప్పాలి. కొందరు ఇంత వెడల్పు రోడ్డు అవసరమా? అంటూ అభ్యంతరాలు తెలుపుతుండగా మరికొందరు తమ స్థలానికి రిజిసే్ట్రషన ఉందని నిర్మాణాల్లో స్థలాలు కోల్పోతే వాటికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కొందరు నిర్మాణాలు తొలగించేట ప్పుడు ముందుగా మా పక్కవారి నిర్మాణాలు తొలగించి తరువాత మావి తొలగించండి లేకుంటే ఊరుకునేదిలేదని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా అనేక అభ్యంతరాల మధ్య ఈ పనులు ఎప్పుడు పూర్తి చేయాలో తెలియక అటు అధికారులు ఇటు కాంట్రాక్టర్లు తలలు పట్టుకుం టున్నారు. రంగసముద్రం నుంచి పోరుమామిళ్ల టౌన వరకు ముందు విస్తరణ పనులు పూర్తి చేస్తే తరువాత ఇరువైపులా నిర్మాణాలు చేయవచ్చ ని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద డ్రైనేజీ కాల్వ, ఫ్లాట్‌ఫాం నిర్మాణాలకు దాదాపు 11 అడుగుల వెడల్పుతో సున్నంతో మార్కింగ్‌ కూడా వేసి కొందరు ఆ స్థలాలను ఖాళీ చేశారు. కానీ విద్యుత స్తంభాలు మాత్రం ఇప్పటి వరకు తొలగించిన దాఖలాలులేవు. విద్యుత శాఖకు సంబంధించి ఇంకా రావాల్సిన డబ్బులు చెల్లించకపోవడంతో సమస్య అలాగే ఉండిపోతోంది. ఇదే రహదారిలో ప్రభుత్వ కళాశాల వద్ద మరో చోట విద్యుత ట్రాన్సఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ఒక వైపు నిర్మాణం జరుగుతుండడంతో ఉన్న ఒక వైపునే వాహనాలు వెళ్లాల్సి ఉండ డంతో ట్రాపిక్‌ సమస్య జఠిలమవుతోంది. అమరావతికి వెళ్లే వాహనాలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో పోరుమామిళ్ల ఎక్కువగా రద్దీగా ఉం టుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాణాలు ఎటువంటి ఆటంకం జరగకుండా ఎప్పుడు పూర్తవుతాయో ఎదురు చూడాల్సిందే.

ఆర్‌ అండ్‌బీ డీఈ ఏమన్నారంటే: రహదారి విస్తరణ పనలు ఆలస్యం విషయమై ఆర్‌అండ్‌బీ డీఈ సలీంను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, రెవెన్యూ అధికారులు చూపించిన హద్దుల వరకే తాము నిర్మాణం చేపడతామన్నారు. ఆక్రమణల తొలగింపు విషయమై కొందరు కోర్టుకు వెళ్లినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 11:51 PM