దుస్థితిలో గ్రామీణ రోడ్లు
ABN, Publish Date - Jun 22 , 2025 | 11:44 PM
గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారాయి.
గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యం పంచాయతీలకు నిధుల కొరత కొన్ని అధ్వానం కాగా మరికొన్ని మరమ్మతులకు నోచుకోని వైనం
పోరుమామిళ్ల, జూన 22 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారాయి. కొన్ని చోట్ల వాహనాల సంగతి ఎలా ఉన్న ఎడ్ల బండ్లు సైతం వెళ్లలేకుండా ఉండగా మరికొన్ని చోట్ల మరమ్మతులకు నోచుకోక కుంటలు, చెరు వులను తలపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. పోరుమామిళ్ల మండలం దమ్మనపల్లె పంచా యతీ ప్రధాన రహదారి నుంచి దాదాపు నాలు గున్నర కిలోమీటరు అధ్వానంగా ఉంది. ఈ పంచాయతీని ఆనుకుని సుంకేసులపల్లె, తోట పాలెం, దమ్మనపల్లె పాతూర్లు ఉన్నాయి. అంతే కాక ఈ రహదారికి ఇరువైపులా దమ్మనపల్లె, సుంకేసులపల్లె ప్రాంత రైతులే కాకుండా బలి జకోటకు చెందిన రైతుల పొలాలు కూడా ఉన్నాయి. రైతుల వ్యవసాయాననికి సంబంధిం చి పొలాలకు ఎరువులు తీసుకెళ్లాలన్నా ఆ దారి గుండానే వెళ్లాల్సి ఉంది. వర్షాకాలంలో అయితే ఆ రహదారుల్లో ఉన్న గుంతల కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడాల్సిందే. గతం లో మార్కెట్‌యార్డు నిధులు రూ.74లక్షలు మంజూరైతే కమిటీకి రుణాల కోసం ప్రయత్నం చేశారు. పెట్టుబడులు పెడితే అప్పులు తప్ప బిల్లులు వచ్చేలా లేవని అప్పట్లో కాంట్రాక్టర్లు కూడా వెనకడుగు వేశారు. దీంతో ఆ రోడ్డు అలాగే ఉండిపోయింది. పోరుమామిళ్ల చెరువు కట్టకు చాలా మంది ఆ దారి వెంటే వెళ్లేవారు కానీ ఆ రహదారి చూస్తే అధ్వాన్నంగా ఉంది. ఇక రంగసముద్రం పంచాయతీ పరిధిలోని ఆదిఆంరఽధపాలెం వెళ్లే రహదారి నీటి గుంతల ను తలపిస్తున్నాయి. ఈ రహదారి వెంట రెడ్డి నగర్, టీచర్స్‌కాలనీ, ఎస్టీకాలనీ, ఆదిఆంధ్రపా లెంకు వెళ్లాలంటే గగనంగా మారింది. ఈ రోడ్డుకిరువైపులా ఎత్తయిన భవనాలు నిర్మించి న వారు తమ నివాసాల ముందు ఎత్తుగా మట్టి వేయడంతో పాటు ఇళ్లల్లోని నీరంతా రోడ్లపైకి వదిలేయడంతో నీటి గుంటలను తలపిస్తుంది. వర్షం వచ్చిందంటే ఎక్కడ గుంత ఉందో ఎక్కడసాఫీగా ఉందో తెలియని పరిస్థితి. స్కూలు బస్సులు, ఆటోలు, లారీలు నిత్యం ఈ రహదారి వెంట తిరుగుతుంటాయి. ఈ రహదారికి ఇరువైపులా డ్రైనేజీ కాల్వలు లేకపో వడమేనని స్థానికులు పేర్కొంటున్నారు.
పీఆర్ ఏఈ ఏమన్నారంటే: గ్రామీణ రోడ్ల దుస్థితి విషయమై పంచాయతీరాజ్ ఏఈ సుబ్రమణ్యంను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, దమ్మనపల్లె పంచాయతీలోని నాలుగున్నర కిలో మీటర్ల రోడ్డు నిర్మాణానికి కోటి రూపాయలు ప్రతిపాదనలు పంపామన్నారు. నిధులు మం జూరైతే రహదారి సమస్య తీరుతుందన్నారు.
నడవాలంటే నరకప్రాయం
దువ్వూరు, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): దువ్వూరు మండలంలోని కొన్ని ప్రాంతాల్లో పంచాయతీరాజ్ రోడ్ల పరిస్థితి నడవాలంటే నరకప్రా యంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే కొన్ని చోట్ల ఇవి బాగుపడుతున్నా మరికొన్ని చోట్ల వాటి బాగుకు కృషి చేయాల్సి ఉంది. ప్రధానంగా మదిరేపల్లి నుంచి పెద్దసింగనపల్లె వరకు ఒకటిన్నర కిలోమీటర్ల మేరకు రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది. ఏళ్ల తరబడి ఈ దారి బాగు గురించి ఎవరు పట్టించుకోకపోవడంతో గులకరాళ్లు తేలి వాహనదారులు వెళ్లాలంటే హడలిపోతున్పారు.. ఈ రోడ్డుకు ఇరువైపుల రైతుల పొలాలు ఉన్నాయి. వాటి దగ్గరకు వెళ్లేటప్పుడు ఇబ్బందులు తప్పడంలేదు. గుడిపాడు నుంచి మనేరాంపల్లె, పెద్దసింగనపల్లె, మదిరేపల్లె, అటు నుంచి బాలాయపల్లె, నీలాపురం, దువ్వూరు వరకు నిత్యం వాహనాలు తిరుగుతుంటాయి. ఇంతకు మునుపు రూ.14 లక్షలతో గ్రావెల్ రోడ్డు మంజూరైనా ఇది అమలుకు నోచుకోలేదు. ఇకనైనా అధికారులు స్పందించి కొత్త రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Jun 22 , 2025 | 11:44 PM