త్వరలో తాళ్లపాక నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సు సర్వీసు
ABN, Publish Date - Jul 16 , 2025 | 11:50 PM
అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక నుంచి తిరుపతికి త్వరలో ఆర్టీసీ బస్సు నడపనున్నట్లు నేషనల్ బీసీ ఫ్రంట్ కన్వీనర్ కేఎంఎల్ నరసింహ తెలిపారు.
ఆర్టీసీ డీఎంకు వినతిపత్రం సమర్పిస్తున్న కేఎంఎల్ నరసింహ
రాజంపేట, జూలై 16 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక నుంచి తిరుపతికి త్వరలో ఆర్టీసీ బస్సు నడపనున్నట్లు నేషనల్ బీసీ ఫ్రంట్ కన్వీనర్ కేఎంఎల్ నరసింహ తెలిపారు. బుధవారం ఆర్టీసీ డీఎం రమణయ్యతో ఈ విషయమై చ ర్చించారు. భక్తులకు, పర్యాటకులకు తాళ్లపాక నుంచి తిరుపతికి బస్సు సౌకర్యం కల్పిస్తే అన్నివిధాల న్యాయం జరుగుతుందని డీఎంకు వివరించగా ఆయన సానులకూంగా స్పందించినట్లు తెలిపారు. ఈ చర్చల్లో అసిస్టెంట్ మేనేజర్ మాధవిలత, కేఆర్‌ఎన రెడ్డి పాల్గొన్నట్లు తెలిపారు.
Updated Date - Jul 16 , 2025 | 11:50 PM