రేషన్ పంపిణీ సజావుగా జరగాలి
ABN, Publish Date - Jun 01 , 2025 | 11:09 PM
రేషన బియ్యం పంపిణీ సజావుగా నిర్వహించాలని, ఎక్కడా అక్రమాలకు తావులేకుండా చూడాలని జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ పేర్కొన్నారు.
జమ్మలమడుగు, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): రేషన బియ్యం పంపిణీ సజావుగా నిర్వహించాలని, ఎక్కడా అక్రమాలకు తావులేకుండా చూడాలని జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ పేర్కొన్నారు.జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని తేరురోడ్డులో రేషన్‌షాపును ఆదివారం ఆర్డీవో ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ రేషన్ షాపు నుంచి దివ్యాంగులకు నడవలేక ఇబ్బంది పడుతున్న వారి ఇంటి వద్దకే రేషన్ పంపిస్తారన్నారు. ప్రతి రేషన్ డీలర్ నిబంధనలు పాటించి పంపిణీ సజావుగా జరగాలని సమస్యలు రాకూడదన్నారు. ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూ చించారు. ఈ కార్యక్ర మంలో పాల్గొన్న టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి భూపేశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకంలో భాగంగా 15వ తేదీ వరకు ప్రతిరేషన్‌షాపు ఓపెన్ చేసి ఉండాలన్నారు. ప్రతి రేషన్‌షాపులో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ పంపిణీ చేయాలని సూచించారు. వైసీపీప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తామని చెప్పి విఫలమయ్యారన్నారు. అలాంటి దుస్థితిని తొలగించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంబందిత మంత్రి నాదేండ్ల మనోహర్ ఎక్కడ ఎలాంటి అక్రమాలు జరుగకుండా చర్యలు తీసుకున్నారన్నారు. తహసీల్దారు శ్రీనివాసరెడ్డి, వారి సిబ్బంది, రేషన్ డీలర్లు టంగుటూరి విశ్వనాథరెడ్డి, ధనుంజయ, పాల్గొన్నారు.
బద్వేలు రూరల్‌లో: చౌక దుకాణాల్లో రేషన కార్డుదారులకు బియ్యం, చక్కెర, తదితర వస్తు వులన్నింటినీ డీలర్లు సక్రమంగా పంపిణీ చేయా లని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కోరారు. మండ ల పరిధిలోని రాజుపాలెం గ్రామంలో కూటమి నాయకుడు బొజ్జ రోశన్నతో కలిసి ఆదివారం చౌక దుకాణంలో నిత్యావసర సరుకుల పంపిణీ ని ఆమె పార్రంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రేషన పంపిణీ సక్రమంగ జరిగేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని, ప్రతి నెలా 1 నుంచి 15 వరకు ఉదయం 8 నుంచి 12, సాయంత్రం 4 నుంచి 8 వరకు నిత్వావసర సరుకులు పంపిణీ చేసే ఽవిధంగా చర్యలు చేపట్టామన్నారు. దివ్యాం గులు, 65 ఏళ్లు పైబడ్డ వృద్ధులకు ఇంటి వద్దకే రేషన పంపిణీ చేసేలాగా ఆదేశాలు జారీ చేయ డం జరిగిందని, కార్యక్రమంలో రూరల్ అధ్యక్షు డు బసిరెడ్డి రవికుమార్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, ఎన ఫోర్స్‌మెంటు డీటీ శివశంకర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పోరుమామిళ్లలో: రేషనషాపుల ద్వారా లబ్ధిదా రులకు బియ్యం అందేలా చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ అన్నారు. ఆదివారం పోరుమామళ్ల మేజరు పంచాయతీ బెస్తవీధిలోని 3వషాపును ఆమె ప్రారంభించి మాట్లాడుతూ ప్రభుత్వం రేషనషాపుల వద్దనే సరుకులు పంపిణీ చేయా లని ఆదేశాలు జారీ చేసిందన్నారు. అనంతరం ఆమె లబ్ధిదారులకు రేషన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేజరు పంచాయతీ సర్పంచ యనమల సుధాకర్ కూటమి నాయకుడు బొజ్జ రోశన్న, తహసీల్దరు చంద్రశేఖ ర్‌రెడ్డి, టీడీపీ నాయకులు చెన్నరాయుడు ఇమాంహుసేన, మల్లిఖార్జునరెడ్డి, మస్తాన, సీతా వెంకటసుబ్బ య్య, సత్యరాజ్ ప్రొఫెసరు బాషా పాల్గొన్నారు.
కొండాపురంలో: మండలంలో కొత్తగా 16 రేషనషాపులను ప్రారంభించినట్లు తహసీల్దార్ గురప్ప తెలిపారు. కొత్త డీలర్లు కూడా ఆదివా రం నుంచే రేషన పంపిణీ ప్రారంభిచినట్లు ఆయన తెలిపారు. 15 వతేదీ వరకు రేషన పం పిణీ సక్రమంగా చేయాలని తహసీల్దార్ డీలర్ల ను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్ణీత వేళల్లో పంపిణీ చేయాలని కోరారు.
మైదుకూరు రూరల్‌లో : మైదుకూరు మున్సి పాలిటీ, మండలంలోని రేషన్‌షాపులు పండుగ వాతావరణంలో ఆదివారం అధికారులు, పార్టీ నాయకులు ప్రారంభించారు. తెల్లవారుజాము నుంచే రేషన్‌షాపుల వద్ట రేషన్ పంపిణీ చేశా రు. 65 ఏళ్ల వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ పం పిణీ చేశారు. రేషన్‌షాపుల వద్ద కార్డుదారులు ఉదయం నుంచి రేషన్ తీసు కొన్నారు.
బ్రహ్మంగారిమఠంలో: బ్రహ్మంగారిమఠం మం డలంలో ఆదివారం చౌకధరల దుకాణాల నుంచి నిత్యావసర వస్తువులు గతంలో మాదిరిగానే డీలర్ల చేతుల మీదుగా పంపిణీ చేపట్టారు. ఉద యం 9గంటల నుంచి మండలంలో 16 రేషన షాపుల డీలర్ల నుంచి పేదలకు బియ్యాని., కంది పప్పు, చక్కెరను పంపిణీ చేశారు. బి.మఠం ఇనచార్జి తహసీల్దారు రాజనరసింహనరేంద్ర, సోమిరెడ్డిపల్లె పంచాయతీలో నరసన్నపల్లె, తోట్లపల్లె, నరశెట్టిపల్లె గ్రామాల్లోని చౌకదుకాణం తనిఖీ చేశారు. అనంతరం ప్రజలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇనచార్జ్ తహసీఆల్దారు రాజనరసింహ నరేంద్ర మాట్లాడుతూ వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే గ్రామ రెవెన్యూ అధికారులు వచ్చి నిత్యా వసర వస్తువులను అందిస్తారని తె లిపారు. ఈ వీఆర్వో సుధాకర్, డీలర్లు పాల్గొన్నారు.
ఎర్రగుంట్లలో:మున్సిపాలిటీ పరిధిలోని టవర్ బజార్, వినాయక నగర్‌లోని ప్రభుత్వ చౌక దుకాణాలను ఆదివారం జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి భూపేష్‌రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందన్నారు.ప్రజలకు బియ్యం, నిత్యావసరాలు అందించడం జరుగుతుందన్నారు.ఎన్డీయె కూటమి ఇన్‌చార్జి మధుసూదనరెడ్డి, కార్యకర్తలు, డీలర్లు పాల్గొన్నారు.
దువ్వూరులో: దువ్వూరు మండలంలో ఆదివారం రేషన్ షాపుల ద్వారా బియ్యం, ఇతర వస్తువుల పంపిణీ చేశారు చౌక దుకాణాల డీలర్లు నేరుగా వారి షాపుల ద్వారా వినియోగదారులకు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రజా పంపిణీ జరగాలని ప్రభుత్వం ఆదేశించడంతో వారి వారి షాపుల్లోనే ఉండి వాటి పంపిణీకి పూనుకున్నారు.
Updated Date - Jun 01 , 2025 | 11:09 PM