లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త
ABN, Publish Date - May 02 , 2025 | 11:37 PM
రాజంపేట శ్రీ భువనగిరి లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా గుండయ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
రాజంపేట, మే 2 (ఆంధ్రజ్యోతి) : రాజంపేట శ్రీ భువనగిరి లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా గుండయ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి లక్ష్మీనరసింహస్వామి అత్యంత మహిమాన్వితుడన్నారు. స్వామివారి గర్భాలయానికి వెండి తాపడం కోసం రూ.10 లక్షలు విలువజేసే 10 కిలోల వెండిని వితరణ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు మాట్లాడుతూ ఆయనకు, కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మోదుగుల కళావతమ్మ ఇంజనీరింగ్ కళాశాల అధినేత మోదుగుల పెంచలయ్య, మాజీ సర్పంచ ఎంఎల్ నారాయణ, దేవస్థాన ధర్మకర్తల మండలి, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 02 , 2025 | 11:37 PM