గొంటువారిపల్లెలో వైభవంగా పోలేరమ్మ జాతర
ABN, Publish Date - May 18 , 2025 | 11:51 PM
మం డలంలోని గొంటువారిపల్లె గ్రామంలో ఆదివారం పోలేరమ్మ జాతర ఘనంగా నిర్వహించారు.
కాశినాయన మే18(ఆంధ్రజ్యోతి): మం డలంలోని గొంటువారిపల్లె గ్రామంలో ఆదివారం పోలేరమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. వేకువ జామునే అమ్మ వారికి సాంప్రదాయ బద్ధంగా మహిళ లు బోనాలు సమర్పించారు. అనంత రం అమ్మవారికి మొక్కులు తీర్చుకొని బంధు మిత్రులకు విందులు పెట్టారు. ఈ జాతరలో బద్వేల్ నియోజకవర్గ టీడీ పీ సమన్వయకర్త రితేష్‌రెడ్డి,మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్ల్లి రామక్రిష్ణారెడ్డి, కడప జడ్పీ ఛైర్మన రామగోవింద రెడ్డి , వైసీపీ బద్వేల్ అదనపు సమన్వయకర్త విశ్వనాథరెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు బసిరెడ్డి వెంకటరెడ్డి, రామసుబ్బారెడ్డి, కె.దుగ్గిరెడ్డి, బాదుల్లా, ఎంపీటీసీ భాస్కర్‌రెడ్డి, సర్పంచ పిచ్చిరెడ్డి, మాజీ సర్పంచ రమణారెడ్డి,హుస్సేనయ్య తదితరులు పాల్గొన్నారు.
బద్వేలు రూరల్‌లో: మండల పరిధి లోని గొడుగునూరు గ్రామంలో ఆది వారం పోలేరమ్మ జాతరను వైభవం గా నిర్వహించారు. జాతర సందర్భం గా మాజీ ఎంపీపీ బైసాని ప్రతాప్ రెడ్డి ఆహ్వానం మేరకు టీడీపీ నియో జకవర్గ ఇనఛార్జ్ రితీష్‌రెడ్డి పోలేరమ్మ గుడికి వెళ్లి పూజలు నిర్వహించి అనంతరం ప్రతాప్‌రెడ్డి ఇంట విందుకు హాజరయ్యారు. జాతరను పురస్కరించు కుని గ్రామం బంధువులు, స్నేహితులతో విందు కోలాహలంగా మారింది. కార్యక్రమం లో మాజీ మున్సిపల్ ఛైర్మన పార్ధసారఽథి, బిజివేముల చం్దద్రశేఖర్‌రెడ్డి, జహంగీర్‌బాషా, మిత్తికాయల రామణయాదవ్, నిమ్మకాయల గోపాల్‌రెడ్డి, టీడీపీ రూరల్ అధ్యక్షులు బసిరెడ్డిరవికుమార్‌రెడ్డి, గోపవరం మండల వైస్ ఎంపీపీ రామ్హ్మోహనరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - May 18 , 2025 | 11:51 PM