రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
ABN, Publish Date - Jul 18 , 2025 | 12:06 AM
ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీసీహెచ ఎస్ హిమదేవి పేర్కొన్నారు.
డీసీహెచఎస్ హిమదేవి
బద్వేలుటౌన, జులై 17 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీసీహెచ ఎస్ హిమదేవి పేర్కొన్నారు. గురువారం బద్వేలు పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీసీహెచఎస్ హిమదేవి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యులపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణ చేసినట్లు తెలిపారు. రోగులకు ప్రభుత్వాసుపత్రికి వ్యయ ప్రయా సలు పడి వైద్యం కోసం వస్తుంటారని, వారికి మెరుగైన వైద్యం కచ్చితంగా అందించా లని ఆమె అన్నారు. విధి నిర్వహణలో ఉండి ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కొంత మంది బయట ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేస్తున్నారని, ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు బయట పరీక్షలు నిర్వహించి డబ్బులు వసూలు చేస్తూ వైద్యం అందిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని, ఈ నేపథ్యంలో ఆసుపత్రి వైద్యులపై విచారణ చేపట్టామన్నారు. అనంతరం ప్రభుత్వా సుపత్రిలో పలురికార్డులను, ఫార్మసిషాపును తనిఖీ చేశారు.
Updated Date - Jul 18 , 2025 | 12:06 AM