కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీ అండ
ABN, Publish Date - May 03 , 2025 | 11:33 PM
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు టీడీపీ పార్టీ అండగా ఉంటుందని రాజంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్నే సుబ్బనరసయ్య పేర్కొన్నారు.
రాజంపేట, మే 3 (ఆంధ్రజ్యోతి) : పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు టీడీపీ పార్టీ అండగా ఉంటుందని రాజంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్నే సుబ్బనరసయ్య పేర్కొన్నారు. మండలంలోని ఆకేపాడు ప్రాంతంలో అవకాశవాదులు పెత్తనం చెలాయిస్తున్నారని, కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన తమను గుర్తించాలని కార్యకర్తలు సుబ్బనరసయ్యకు తెలియజేశారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ కార్యకర్తలకే ప్రాధాన్యత తప్ప అవకాశవాదులకు కాదని అన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ప్రా ధాన్యం ఇస్తున్నామన్నారు. తమ సమస్యల పరిష్కారానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 03 , 2025 | 11:33 PM