పేదవర్గాల వారిని ఆదుకునే కార్యక్రమమే పీ4
ABN, Publish Date - Aug 03 , 2025 | 12:14 AM
పేదవర్గాల వారిని ఆదుకునే కార్యక్ర మమే పీ4 అని బద్వేలు ఆర్డీవో చంద్రమోహన పేర్కొన్నారు.
బద్వేలు, ఆగస్టు2 (ఆంధ్రజ్యోతి): పేదవర్గాల వారిని ఆదుకునే కార్యక్ర మమే పీ4 అని బద్వేలు ఆర్డీవో చంద్రమోహన పేర్కొన్నారు. పట్టణంలోని శ్రీ కృష్ణ దేవరాయ నగర్ పరిధిలో శనివారం స్వయం సహాయక సంఘాల సభ్యుల గ్రూపు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీవో చంద్రమోహన, గోపవరం తహశీల్దారు త్రిభువన రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డిలు పాల్గొని పీ4 కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. అట్టడుగున ఉన్న పేదల కుటుంబాలకు చెందిన వారిని అధిక సంపద ఉన్న వారు సపోర్టుగా నిలిచి వారి అఽభివృద్ధికి తోడ్పాటు నందించాలని తెలిపారు. అర్హత కలిగిన వారు వెంటనే సచివాలయంలో పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు.
Updated Date - Aug 03 , 2025 | 12:14 AM