ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చెత్తకుప్పలో మందులపై వైద్యాధికారుల ఆగ్రహం

ABN, Publish Date - Jul 08 , 2025 | 11:54 PM

ప్రొద్దుటూరు మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీ కార్యాలయ ఆవరణలో చెత్తతోపాటు తగులబడిన ప్రభుత్వ మందుల వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాలిన మందులను పరిశీలిస్తున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ గీత

డిప్యూటీ డీఎంహెచ్‌వో విచారణఫ ఆరుగురికి మెమోలు జారీ

ప్రొద్దుటూరు రూరల్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ప్రొద్దుటూరు మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీ కార్యాలయ ఆవరణలో చెత్తతోపాటు తగులబడిన ప్రభుత్వ మందుల వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణులలో రక్తహీనత నివారణకు ఉపయోగించే ఐరన్‌, కాల్షియం మందులు, సిరఫ్‌లు కొత్తపల్లె పంచాయతీ ఆవరణలో చెత్తకుప్పలో తగులబడుతూ బయటపడ్డ వ్యవహారం పాఠకులకు తెలిసిందే. ఈ సంఘటనపై మంగళవారం జిల్లా వైద్యాధికారి టెలికాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీ కేంద్రాల్లో పనిచేసే ఆశా కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేశారు. సిబ్బంది విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని పేర్కొన్నారు. ఈ ఘటనపై డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ గీత, కల్లూరు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌, కొత్తపల్లె విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌ను సందర్శించి విచారణ చేపట్టారు. చెత్తకుప్పలో కాలిన మందులను విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లోని ఔషధాల స్టాకును పరిశీలించారు. ఆశా కార్యకర్తలు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాల ధాటికి మందులు తడవడంతో ఏమి చేయాలో దిక్కుతోచక పడవే సినట్లు అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో అక్కడి మందులను కల్లూరు పీహెచ్‌సీకి తరలించారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక ఏఎన్‌ఎంతోపాటు అయిదుగురు ఆశా కార్యకర్తలకు మెమోలను జారీ చేశారు. సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. సమస్యాత్మక, కాలం చెల్లినమందులను అధికారులకు తెలియజేసి పీహెచ్‌సీలకు తరలించాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.

Updated Date - Jul 08 , 2025 | 11:54 PM