‘జన సురక్ష’తో పలు ప్రయోజనాలు
ABN, Publish Date - Jul 01 , 2025 | 11:42 PM
జనసురక్ష వల్ల పలు ప్రయోజనాలు పొందవచ్చునని లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు అన్నారు.
లక్కిరెడ్డిపల్లె, జూలై1(ఆంధ్రజ్యోతి): జనసురక్ష వల్ల పలు ప్రయోజనాలు పొందవచ్చునని లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు అన్నారు. మంగళవారం స్థానిక వెంకటేశ్వర జూనియర్ కళాశాల లో జన సురక్ష పథకంపై అ వగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జన సురక్ష పథకం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని, మొబైల్ ఫోనలో వచ్చే ఎలాంటి లిం కులు ఓపెన చేయకుండా జాగ్రత్త వహించాలన్నారు. బిట్స్ సీఎ్‌ఫఎల్ కౌన్సిలర్ పవనకుమార్ మాట్లాడుతూ బడ్జెట్ ప్లానింగ్, నామిని, డిజిటల్ ట్రాన్సాక్షనపై వివరించారు. అనంతరం లక్కిరెడ్డిపల్లె స్టేట్ బ్యాంక్ మేనేజర్ హరిప్రసాద్ మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహనరెడ్డి, డిజిటల్ ట్రాన్సాక్షన కౌన్సిలర్ ప్రభాకర్, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Jul 01 , 2025 | 11:42 PM