మహానాడును విజయవంతం చేయండి
ABN, Publish Date - May 19 , 2025 | 11:39 PM
కడపలో జరుగనున్న తెలుగు దేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పిలుపునిచ్చారు.
మైదుకూరు రూరల్ ,మే 19(ఆంధ్రజ్యోతి) : కడపలో జరుగనున్న తెలుగు దేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పిలుపునిచ్చారు. స్థానిక బద్వేల్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో సోమవారం మైదుకూరు నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు కార్యక్ర మం ఎమ్మెల్యే అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరుగనున్న మహానాడులో సీఎం దృష్టికి తీసుకెళ్లాలని తీర్మా ణించారు. ఇందులో భాగంగా కేపీ ఉల్లి కేంద్రాలను ఏర్పాటు చేయాలని, కేసీ కెనాల్ కాలువల మరమ్మత్తులు, అలగనూరు రిజర్వాయర్‌కు 36 కోట్ల తో పనుల చేస్తే కేసీ కెనాల్ ఆయకట్టు కింద రెండు కార్ల పంటలను పండించుకోవచ్చని, మైదుకూరుకు వంద పడకల ఆసుపత్రి, బీసీ బాలుర గురుకుల పాఠశాల తదితర అంశాలపై సమావేశంలో చర్చించి తీర్మాణం చేశారు. అనంతరం ఎమ్మెల్యే పుట్టా మాట్లాడుతూ అమృత్ 2.0 కార్యక్ర మంలో భాగంగా మైదుకూరు మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి తాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో సుమారు రూ.99 కోట్లు, శెట్టివారిపల్లె చెరువు ఆధునీకీకరణ, మరమ్మతులకు గాను సుమారు రూ.2 కోట్ల 20 లక్షల ను మంజూరు చేయించినట్లు తెలిపారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని ఐదు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించామని శ్మశానవాటికల మరమ్మతులకు సుమారు రూ.5 కోట్ల నిధులను మంజూరు చేయించామని తెలిపారు. టీడీపీ స్థాపించినటప్పటి నుంచి మొదటిసారిగా కడపలో జరుగ నున్న మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు, నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - May 19 , 2025 | 11:39 PM