ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శెట్టివారిపల్లె చెరువుకు మహర్దశ

ABN, Publish Date - May 27 , 2025 | 11:59 PM

నియోజకవర్గ కేంద్రమైన మైదు కూరులోని శెట్టివారిపల్లె చెరువుకు మహర్దశ కలుగనుంది.

శెట్టివారిపల్లె చెరువు

మారనున్న చెరువు రూపురేఖలు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ చొరవతో 16 గ్రామాలకు అందనున్న అమృత్‌ నీరు

మైదుకూరు రూరల్‌ ,మే 27(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ కేంద్రమైన మైదు కూరులోని శెట్టివారిపల్లె చెరువుకు మహర్దశ కలుగనుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ అండ్‌ బ్యూటీపికేషన్‌ సంస్థ, అమృత్‌ 2.0 పఽథకం కింద మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లె చెరువుకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ చొరవతో సుమారు 2 కోట్ల 20 లక్షల రూపాయల నిధులను మం జూరు చేయించారు. దీంతో చెరువు రూపురేఖలు మారనున్నాయి. శెట్టివారి పల్లె చెరువు పూర్తి విస్తీర్ణం సుమారు 110 ఎకరాలు ఉంటుంది. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ ప్రత్యేకంగా శెట్టివారిపల్లె చెరువుకు నిధులను మంజూరు చేయించడం వలన శెట్టివారిపల్లె, యల్లంపల్లె, చిన్నయ్యగారి పల్లె, కేశలింగాయపల్లె, నానువారిపల్లె, గడ్డమాయపల్లె తదితర 16 గ్రామా లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భూగర్భజలాలు పెరుగుదల వలన రైతులకు లబ్ధి చేకూరనుంది. చెరువులో నీరు ఉంటే సుమారు వెయ్యి ఎకరాలలో రైతులు పంటలను పండించుకొంటున్నారు. చెరువు కింది భాగంలో తెలుగు గంగా కాలువ వెళ్లడంతో కొండ ప్రాంతం నుంచి వచ్చే వర్షం నీరు చెరువు లోకి రాకుండా కాలువలోకి వెళుతున్నాయి. అంతేకాకుండా చెరువు కన్నా కాలువ కింది భాగంలో ఉండటంతో చెరువులోని నీరు ఊటల ద్వారా నిల్వ చేసిన నీరు చెరువలో నిలబడటం లేదు. మిట్టమానుపల్లె చెరువు నుంచి గతంలో అలుగు పారేందుకు చిన్న కాలువ ఉండేది. కాని కొందరు భూ ఆక్రమణ చేసి కాలువ లేకుండా చేశారు. ఆ కాలువ ఉంటే శెట్టివారిపల్లె చెరువు ఎప్పటికి నీటితో పుష్కలంగా ఉండేదని గ్రామస్థులు చెబుతున్నారు.

చెరువులో నీటి నిల్వ కోసం ఏమిచేయాలంటే..

శెట్టివారిపల్లె చెరువులో నీటిని నిల్వ చేయాలంటే ముందుగా తెలుగుగంగా కాలువ నుంచి నీటిని వదులుకోవడానికి ఒక గేట్‌ కలిగిన తూమును నిర్మించడంతోపాటు చెరువు నిండిన తరువాత నీరు బయటికి వెళ్లకుండా మరో తూమును నిర్మించి దానికి గేటు ఏర్పాటు చేయాలి. అలాగే గోరేటి వంక నుంచి వచ్చే నీటి కోసం ఒక తూమును, మిట్టమానుపల్లె చెరువు అలుగునీరు వచ్చే విధంగా చిన్న కాలువను ఏర్పాటు చేయాలని గ్రామ స్థులతోపాటు వ్యవసాయ రైతులు పేర్కొంటున్నారు. అలాగే చెరువు లో పెద్ద గుంతలు ఉండటం వలన నీరు నిల్వ ఉండటం లేదని వాటిని పూ డ్చి నీరు నిల్వ ఉండేలా పనులు చేపట్టాలని కోరుతున్నారు. చెరువు కట్ట ను పటిష్టం చేయాలని లీకేజీలను అరికట్టాలని వారు కోరుతున్నారు.

16 గ్రామాలకు నీటి సమస్య ఉండదు

శెట్టివారిపల్లె చెరువు వల్ల సుమారు 16 గ్రామాల నీటి సమస్య ఉండదు. ఎందుకంటే చెరువు ఒక్క సారి నిండిందంటే చుట్టుపక్క గ్రామాలతోపాటు అడుగంటిన భూగర్భజలాలు తిరిగి బోర్లకు పుష్కలంగా నీరు వస్తా యి, దీంతో పంటలు పుష్కలంగా పండుతాయి. ఎమ్మె ల్యే పుట్టా చొరవతో చెరువుకు రెండవ సారి నీరు నింప డంతో వివిధ గ్రామాల్లోని సొద్ద, జొన్న తదితర పంటలు పండి రైతులు లక్షల రూపాయలు సంపాదించుకొన్నారు.

-పొలిమేర శివశంకర్‌రెడ్డి, గ్రామస్థుడు

Updated Date - May 27 , 2025 | 11:59 PM