ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహానాడును విజయవంతం చేయాలి

ABN, Publish Date - May 20 , 2025 | 11:16 PM

కడపలో జరుగనన్న తెలుగు దేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చే యాలని టీడీపీ రైల్వేకోడూరు ఇనచార్జ్‌, కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి పిలుపునిచ్చారు.

చలో కడప లోగో స్టిక్కర్లు విడుదల చేస్తున్న ముక్కా రూపానందరెడ్డి తదితరులు

- టీడీపీ ఇనచార్జ్‌, కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి

రైల్వేకోడూరు,మే 20(ఆంధ్రజ్యోతి): కడపలో జరుగనన్న తెలుగు దేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చే యాలని టీడీపీ రైల్వేకోడూరు ఇనచార్జ్‌, కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రైల్వేకోడూరు రాజ్‌ కన్వెన్షన హాలులో మినీ మహానాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేకోడూరులో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. రా ష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల చైర్మన కేకే చౌదరి మాట్లాడుతూ మహానాడు కార్యక్రమాన్ని కడపలో నిర్వహించడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌, ఉమ్మడి కడప జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన ఎర్రగుండ్ల జయప్రకాష్‌, రాష్ట్ర తెలుగు యువత మాజీ అధ్యక్షుడు కట్టాబాలాజీనాయుడు, ఎస్సీ కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్‌ దుద్యాల అనితదీప్తి మాట్లాడుతూ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. టీడీపీ నా యకురాలు ముక్కా వరలక్ష్మీ, మాజీ సర్పంచ మలిశెట్టి మురళీధర్‌గౌడ్‌, మైనార్టీ నాయకులు పఠాన మౌలా, జుబేర్‌, కూటమి నాయకులు కల్లా చలపతి, అనుముల గుండం చంద్రమోహన, వాసుదేవరెడ్డి, గుత్తి నరసింహ, లారీ సుబ్బరాయుడు, బాలాంజనేయులు, కోడూరు పట్టణ అధ్యక్షులు పోకల మణి, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

మినీ మహానాడులో తీర్మానాలు...

రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం మినీ మహానాడు కార్యక్రమంలో తీర్మానాలను ప్రకటించారు.చిట్వేలి-పెనగలూరు మండలాలలో సాగు-తాగునీటి అవసరాలకు సోమశిల వెనుక జలాలను తీసుకురావడం, కోడూరు-పెనగలూరు మధ్య గుంజననదిపై ప్రతి 2 కిలోమీటర్ల దూరంలో చెక్‌డ్యాంలు నిర్మించడం, గాలేరు-నగిరి కాలువ నీటిని కోడూరు నియోజకవర్గ ప్రజలకు అందించడానికి చర్యలు తీసుకోవడం, కోడూరు-వెంకటగిరి రహదారి నిర్మాణం పూర్తి చే యడం, ఇందిరమ్మ ఇళ్లకు మరమ్మతులు చేయడం, కోడూరులో భూగర్భ డ్రైనేజి వ్యవస్థను ఏర్పాటు చే యడం, ఓబులవారిపల్లె-విజయవాడల మధ్య ఫ్యాసింజర్‌ రైలును ఏర్పాటు చేయించడం, శిథిలావస్థలో ఉన్న ఆర్‌టీసీ బస్టాండుకు నిధులు మంజూరు చేయించడం, యల్లంరాజు చెరువు మొండికట్ట నిర్మాణానికి అనుమతులు తీసుకురావడం, కోడూరులో డయాలసిస్‌ కేం ద్రం ఏర్పాటు చేయడం, కోడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పడకల సంఖ్యను పెంచడం, అరటి, మామిడి, బొ ప్పాయి పంటలకు మార్కెటింగ్‌ సౌకర్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు మంజూరు చేయించడం, పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం, అప్పాజ్యూస్‌ పరిశ్రమను పునఃప్రారంభించడం, ఐదు మండలాలలో కమ్యూనిటీహాళ్ల నిర్మాణాలు చేపట్టడం, దేవదాయశాఖ, టీటీడీ సౌజన్యంతో దేవాలయాల నిర్మాణాలకు అనుమతి తీసుకరావడం, ఇండోర్‌ స్టేడియంలు, షాదీఖానాల ఏర్పాటు, అసైనమెంట్‌ కమిటీ ద్వారా పేదలకు వ్యవసాయ భూములు ఇవ్వడం తదితర కార్యక్రమా లను మినీ మహానాడులో తీర్మానించారు.

Updated Date - May 20 , 2025 | 11:16 PM