మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం
ABN, Publish Date - May 15 , 2025 | 11:58 PM
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం అనా ఎస్‌ఐ రవీంద్రబాబు పేర్కొన్నారు
మొక్కలను పంపిణీ చేస్తున్న ఎస్‌ఐ రవీంద్రబాబు
లక్కిరెడ్డిపల్లె, మే15(ఆంధ్రజ్యోతి): మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం అనా ఎస్‌ఐ రవీంద్రబాబు పేర్కొన్నారు. గురువారం స్థానిక పోలీ్‌సస్టేషనలో దాదాపు 250 పూల మొక్కలను, పండ్ల మొక్కలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ చెట్ల వల్ల ఆక్సిజన ఉత్పత్తి చేయడం, వాతావరణ నియంత్రించడం, నేల కాలుష్యాన్ని తగ్గించడం, వన్య ప్రాణులకు ఆశ్రయం కల్పించడం, భూమిని సారవంతంగా ఉంచడం వంటి ప్రయోజనాలు ఉన్నాయన్నారు. మొక్కలు ఆహారం, మందులను కూడా అందిస్తాయన్నారు. మొక్కలను నాటి పర్యావరణాన్ని కాలుష్యం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు.
Updated Date - May 15 , 2025 | 11:58 PM