చెత్త రహిత గ్రామంగా చేద్దాం : ఎంపీడీవో
ABN, Publish Date - Jun 27 , 2025 | 11:33 PM
ఓబులవారిపల్లె మేజర్ గ్రామ పంచాయతీని చెత్తరహిత పంచాయతీగా తీర్చిదిద్దామని ఎంపీడీవో అన్నారెడ్డి మల్‌రెడ్డి, ఈవోపీఆర్డీ రామ్మోహనరెడ్డి పిలుపునిచ్చారు.
పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో, సిబ్బంది
ఓబులవారిపల్లె, జూన 27 (ఆంధ్రజ్యోతి) : ఓబులవారిపల్లె మేజర్ గ్రామ పంచాయతీని చెత్తరహిత పంచాయతీగా తీర్చిదిద్దామని ఎంపీడీవో అన్నారెడ్డి మల్‌రెడ్డి, ఈవోపీఆర్డీ రామ్మోహనరెడ్డి పిలుపునిచ్చారు. ఓబులవారిపల్లె గ్రామ పరిధిలోని వీధుల్లోని చెత్తను పంచాయతీ కార్యదర్శి భారతి ఆధ్వర్యంలో గ్రీన అంబాసిడర్ల ద్వారా తొలగించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే చెత్త నిర్వహణ సక్రమంగా చేయాలన్నారు.
Updated Date - Jun 27 , 2025 | 11:33 PM