ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూఆక్రమణలను సహించేదిలేదు : ఆర్డీవో

ABN, Publish Date - Apr 18 , 2025 | 11:41 PM

భూ ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారి నైనా ఉపేక్షించేదిలేదని బద్వేల్‌ ఆర్డీవో చంద్రమోహన హెచ్చరించారు.

నాయనపల్లె కొండపొరంబోకు భూములను పరిశీలిస్తున్న ఆర్డీవో

నాయనపల్లె అటవీ పొరంబోకు భూముల పరిశీలన

రెవెన్యూ అధికారులపై ఆగ్రహం రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

కాశినాయన ఏప్రిల్‌18(ఆంధ్రజ్యోతి):భూ ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారి నైనా ఉపేక్షించేదిలేదని బద్వేల్‌ ఆర్డీవో చంద్రమోహన హెచ్చరించారు. శుక్రవా రం నాయనపల్లె రెవెన్యూ పొలంలో ఆక్రమణకు గురైన సర్వే నెంబర్‌ 128,. 129(1),.130 కొండ పొరంబోకు భూము లను ఆయన పరిశీలించారు. ఇప్పటికే ప లువురు దర్జాగా రెవెన్యూ అధికారులు నాటిన హెచ్చరిక బోర్డులను తొలగించి ఆక్రమించుకొ అరటి తోటలను సాగుచేశారు. వాటన్నింటిని సమగ్రంగా పరిశీ లించిన ఆర్డీవో మాట్లాడుతూ ఆక్రమణదారులు ఇష్టారాజ్యంగా వందల ఎకరాల ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించి ఎస్టేట్‌లు తయారు చేస్తుంటే రెవెన్యూ అధికారులు ఏమిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆక్రమణకు గురైన భూములను డ్రోనల సహాయంతో సమగ్రంగా పరిశీలన చేసి ఎంత ఆక్రమిం చారు ఎవరెవరు ఆక్రమణకు పూనుకున్నారో రెండు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో తహసీల్దారు వెంకటసుబ్బయ్య, ఆర్‌ఐ అమర్‌నాద్‌రెడ్డ్డి, మండల ఇనచార్జి సర్వేయర్‌ రామాం జనేయులు, సర్వే డివిజనల్‌ ఇనస్పెక్టర్‌ రఘురామ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 11:41 PM