మహానాడులో కడప సత్తా చాటాలి
ABN, Publish Date - May 26 , 2025 | 12:00 AM
కడపలో ఈనెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే టీడీపీ మహానాడును విజయవంతం చేయడంతోపా టు కడప సత్తాచాటాలని ఎమ్మిగనూ రు ఎమ్మెల్యే బి.జయనాగేశ్వరరెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డిలు పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, భూపేశ్‌రెడ్డిలు టీడీపీ శ్రేణులకు పిలుపు
జమ్మలమడుగు, మే 25 (ఆంధ్రజ్యోతి): కడపలో ఈనెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే టీడీపీ మహానాడును విజయవంతం చేయడంతోపా టు కడప సత్తాచాటాలని ఎమ్మిగనూ రు ఎమ్మెల్యే బి.జయనాగేశ్వరరెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహానాడుకు జనసమీకరణతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు, అబిమానులను చైతన్య పరచి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈనెల 29వ తేదీ కడపలో జరుగబోయే మహానాడును సుమారు వెయ్యి వాహనాల్లో 25 వేల మంది జనసమీకరణతో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, టీడీపీ పరిశీలకుడు మద్దూరి రామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు, జంబాపురం రమణారెడ్డి, పొన్నతోట మల్లికార్జున, కర్ణాటి రామాంజనేయరెడ్డి, గండికోట కిరణ్, శ్రీనివాసులరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 26 , 2025 | 12:00 AM