గుంతలమయంగా జ్యోతి రోడ్డు
ABN, Publish Date - Jun 20 , 2025 | 11:36 PM
మండల కేంద్రమైన నర్సాపురం మీదుగా జ్యోతిక్షేత్రానికి వెళ్లే ప్రదాన రహదారి గుంతలమయంగా ఉన్నా పట్టించుకునే వారు కరువయ్యారు.
అసంపూర్తిగా పనులు ఆపివేయడంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు మండల కేంద్రం పరిస్థితే ఇలా ఉంటే ఎలా..?
కాశినాయన జూన 20(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన నర్సాపురం మీదుగా జ్యోతిక్షేత్రానికి వెళ్లే ప్రదాన రహదారి గుంతలమయంగా ఉన్నా పట్టించుకునే వారు కరువయ్యారు. రోడ్డు సరిగాలేకపోవడంతో జ్యోతీ క్షేత్రా నికి వెళ్లే భక్తులతో పాటు ఆకులనారాయణపల్లె నుంచి ఉప్పలూరు వరకు దాదాపు 14 గ్రామాల ప్రజలు ఈదారిగుండా రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ఈదారి గుండా ప్రయాణిస్తూ ఉంటాయి. గత వైసీపీ పాలనలో రూ.12 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో వరికుంట్ల నుంచి ఓబుళాపురం వరకు 12 కి.మీ డబుల్ రోడ్డ్డు పనులు మంజూరయ్యాయి. 3సంవత్సరాలక్రితం పనులు ప్రారంభించి దాదాపు రూ.9 కోట్లు వెచ్చించి పనులు చేపట్టారు. అయితే బిల్లులు రాకుండా నిలిచిపోయాయని రెండు సంవత్సరా క్రితం కాంట్రాక్టర్ పనులు అపేశాడు. దీంతో కీలకమైన ఓబుళాపురం నుంచి మండల కేంద్రమైన నర్సాపురానికి వచ్చే ప్రధానమైన 3 కి.మీ. మేర రోడ్డు పనులు నిలిచి పోవడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణాతీతంగా మా రాయి. ఓమోస్తారు వర్షం పడినా గుంతల్లో నీళ్లు నిలిచి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పలువురు వాహనదారులు గుం తలను తప్పించబోయి అదుపు తప్పి కిందపడి గాయాలపాలవుతున్నారు. మరోవైపు కాంట్రాక్ట్ గడువు ముగిసిపోవడం డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభించి పూర్తిచేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడిం ది. నిత్యం మండల స్థాయి అధికారులతోపాటు,ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు ఈరోడ్డుమీదనే వచ్చిపోతూ ఉంటారుకానీ రోడ్డు గురించి పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ్ట పనులు పూర్తి చేయాలని మండల ప్రజలు. కోరుతున్నారు.
ఆర్‌అండ్ బీ డీఈ ఏమన్నారంటే: ఈ రోడ్డు విషయంపై ఆర్‌అండ్‌బీ డీఈ సలీమ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా నర్సాపురం రోడ్డు ఇబ్బంది కరంగా ఉన్నమాట వాస్తవమేనన్నారు. ఇక్కడ దాదాపు రూ.9 కోట్ల్లతో 75 శాతం పనులు పూర్తయ్యాయి. బిల్లులు నిలిచి పోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు. సమయం పెంచి తిరిగి పనులను మొదలు పెట్టిం చేలా ఉన్నతాధికారులకు తెలియపరుస్తున్నాం. ప్రస్తుతానికి ఇబ్బందికరం గా ఉన్న గుంతలు పూడ్పించేలా చర్యలు చేపడతామన్నారు.
Updated Date - Jun 20 , 2025 | 11:36 PM