ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇదేనా..! స్వచ్ఛభారత

ABN, Publish Date - Jun 26 , 2025 | 11:59 PM

స్వచ్ఛభార త.. స్వచ్ఛంధ్ర.. స్వర్ణాంధ్ర అంటూ పరిశుభ్రత పెంపొందించాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నా చాలా చోట్ల అవి మొక్కుబడిగా సాగుతున్నాయి.

పత్తూరు ఆయూష్మాన్‌ భవన్‌కు వెళ్లే దారిలో పేరుకుపోయిన చెత్తాచెదారం

ఖాజీపేట, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛభార త.. స్వచ్ఛంధ్ర.. స్వర్ణాంధ్ర అంటూ పరిశుభ్రత పెంపొందించాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నా చాలా చోట్ల అవి మొక్కుబడిగా సాగుతున్నాయి. ఇందుకు నిదర్శనం ఖాజీపేట మండలం పంచాయతీ కేంద్రమైన పత్తూరు ఆయూష్మాన్‌ భవన్‌కు వెళ్లే దారిలో రోడ్డుకు ఇరు వైపులా చెత్తకుప్పలు పేరుకుపోయి అపరిశుభ్రత కు నిలయాలుగా మారాయి. గ్రామాలు, పట్టణా ల్లో చెత్తచెదారాలు లేకుండా పరిశుభ్రత పెంపొం దించడానికి స్వచ్ఛభారత్‌ పథకం కింద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే ఇలా పం చాయతీ కేంద్రాల్లోనే చెత్తకుప్పలు దర్శనమి స్తున్నాయంటే ఇక గ్రామాల పరిస్థితి ఎలా ఉం టుందో ఊహించవచ్చు. ప్రతినెలా మూడవ శనివారం స్వచ్ఛభారత, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నా చెత్తకుప్పలు పేరుకుపోతుండడం గమనార్హం. మండల స్థాయి అధికారులు కార్యాలయాల ముందు కొన్ని చోట్ల పిచ్చిమొక్కలు తొలగించడంతోపాటు ర్యాలీ చేపట్టి ఫొటోలకు ఫోజులివ్వడం వాటిని ఆనలైన ద్వారా ప్రభుత్వానికి మేము ఇది చేశాం, అది చేశాం అంటూ పంపి కార్యక్రమం మమ అనిపిం చారు. దీంతో తహసీల్దార్‌ కార్యాలయం, బాలికో న్నత పాఠశాల ఆవరణాలతోపాటు డయాంఖా నపల్లెకు వెళ్లే రహదారి చెత్తకుప్పలకు నిలయా లుగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పం దించి చెత్త రహిత సమాజం కోసం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jun 26 , 2025 | 11:59 PM