వీడని బాలిక హత్యకేసు మిస్టరీ ?
ABN, Publish Date - Aug 03 , 2025 | 11:43 PM
జమ్మలమడుగులోని పర్యాటక ప్రాంతమైన గండికోటలో బాలిక హత్య కేసు మిస్టరీగానే మిగిలిపోతోంది.
జమ్మలమడుగు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగులోని పర్యాటక ప్రాంతమైన గండికోటలో బాలిక హత్య కేసు మిస్టరీగానే మిగిలిపోతోంది. జూలై 14వ తేదీ గండికోటలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం వెనుక బాలిక హత్య జరిగిన విషయం విదితమే. ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికను ప్రియుడు గండికోటకు తీసుకురావడం ఆతర్వాత బాలిక శవమై తేలింది. హత్య జరిగి మరుసటి రోజు జూలై 15వ తేదీ నుంచి పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు బృందాలు విస్తృతంగా పరిశీలించినా ఇం త వరకు హత్య ఎందుకు జరిగింది? ఎలా జరిగింది అన్న విషయాలు తేల్చకపోవ డంతో ఇంకా ఈ ఘటన ఎన్నాళ్లు పడుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసు ప్రత్యేక బృందం గండికోట ప్రాంతంలో తనిఖీలు చేపట్టడం, టెక్నాలజీ ఎంతగా ఉన్నా హత్య చేసినవారు ఆ టెక్నాలజీకి సైతం అంతు చిక్కకుండా ఉండడం గమనార్హం. పోలీ సు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పలుమార్లు పరిశీలించి సుమారు 500 మందికిపైగా విచారణ చేసినట్లు తెలిసినా ఎందుకు ఘటనపై వివరాలను వెల్లడించలేకపోతు న్నారో కోటి ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయ కారణాలతోనే బాలిక హత్యా సంఘటన ఇంత వరకు వెలుగుతీయలేకపోతున్నారని పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉండగా బాలిక హత్య ఉదంతంతో గండికోట ప్రాంతానికి పర్యాటకులు రావాలన్నా భయపడిపోతున్నారు. పర్యాటక రంగమైన గండికోటలో వసతులు కల్పించినా రక్షణ లేదని చెప్పుకోవడంతో పర్యాటకులు రావడం తగ్గారని సమాచా రం. ఇప్పటికైనా పోలీసు అధికార యంత్రాంగం బాలిక కేసుకు సంబందించి విచారణ వెంటనే పూర్తి చేసి వివరాలను వెల్లడిస్తే మిస్టరీ వీడుతుందని పలువురు భావిస్తున్నా రు. మరి ఆదిశగా జిల్లా పోలీసు యంత్రాంగం విచారణను వేగవంతం చేసి మిస్టరీని బహిర్గతం చేస్తారని ఆశిద్దాం.
Updated Date - Aug 03 , 2025 | 11:43 PM