భారతదేశం సత్తాచాటింది
ABN, Publish Date - May 18 , 2025 | 11:48 PM
భారత్, పాకిస్థాన్ యుద్ధంలో ప్రధాని మోదీ, మన సైన్యం సత్తాచాటారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సూచించారు.
భవిష్యతలో మనజోలికి రాకుండా
పాక్‌కు సరైన గుణపాఠం
దేశం కోసం మనందరం ఏకం కావాలి
తిరంగా ర్యాలీలో ఎమ్మెల్యే
ఆదినారాయణరెడ్డి,
టీడీపీ ఇనచార్జి భూపేష్‌రెడ్డి
జమ్మలమడుగు, మే 18 (ఆంధ్రజ్యోతి): భారత్, పాకిస్థాన్ యుద్ధంలో ప్రధాని మోదీ, మన సైన్యం సత్తాచాటారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సూచించారు. భవిష్యత్తులో పాకిస్థాన్ మన జోలికి రాకుండా ఉండాలంటే భారతదేశంలో అన్ని మతాలవారు ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చా రు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం సందర్భంగా ఆదివారం జమ్మలమడుగు పట్టణంలో ‘మేము భారతసాయుధ బలగాలకు అండగా ఉంటాం’ అంటూ మూడు రంగుల జెండా పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండులోని గాంధీ విగ్రహం వద్ద జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత సైన్యం సిందూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులపై దాడి చేసి భారత్ సత్తా చాటామన్నారు. హిందువులు, ముస్లింలు, జైనులు, క్రిస్టియన్లు, సిక్కులు అన్ని వర్గాల ప్రజలు కలిసి ఐకమత్యంగా ఉండాలన్నారు. యుద్ధంలో మన జవాన్లు ఆరు మందితో పాటు మన ప్రాంత తెలుగువాసి మురళీనాయక్ వీర సైన్యానికి జోహార్లు తెలుపుతున్నామన్నారు. జమ్మలమడుగులో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ర్యాలీ నిర్వహించామన్నారు. టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గట్టి నిర్ణయం తీసుకుని పాకిస్థాన్‌పై సిందూర్ పేరుతో ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పిందన్నారు. జనసేన నియోజకవర్గ నేత నాగార్జున మాట్లాడుతూ భారత్ అంటే ఏంటో ఇప్పటికే పాకిస్థాన్‌కు తెలిసిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రమణారెడ్డి, సింగంరెడ్డి నాగేశ్వరరెడ్డి, గోనా పురుషోత్తంరెడ్డి, బానా శివరామలింగారెడ్డి, రాజారెడ్డి, సంతోష్, కమిషనర్ వెంకటరామిరెడ్డి, పోలీసు అధికారులు డాక్టర్ ఎంఎల్ నారాయణరెడ్డి, చేరెడ్డి చెన్నకేశవరెడ్డి, డాక్టర్ హరికృష్ణ, రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - May 18 , 2025 | 11:48 PM