వర్షంతో వ్యాపారులకు తీవ్రఇక్కట్లు
ABN, Publish Date - May 19 , 2025 | 11:42 PM
జమ్మలమడుగులో ఉరుములు, మెరుపులు, గాలితో కూడిన భారీ వర్షం కురిసింది.
జమ్మలమడుగు, మే 19 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగులో ఉరుములు, మెరుపులు, గాలితో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీనారాపురం వెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయం చుట్టూ ర్పాటు చేసుకున్న వివిధ రకాల దుకాణాలు వ్యాపారాలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్న దుకాణాలకు బహిరంగ వేలంలో రూ.10 లక్షలకుపైగా పాట దక్కించుకున్నారు. అయితే వ్యాపారస్థులకు గేటు వసూళ్లు ముందుగానే చేశారు. ప్రతిరోజు సాయంత్రం వేళల్లో వర్షం కురియడంతో వ్యాపారులకు నష్టం వచ్చినట్లుగా వాపోతున్నారు. రథోత ్సవం రోజు వ్యాపారాలు బాగా జరుగుతాయని ఆశ పెట్టుకున్న వర్షంతో ఇబ్బందులు తలెత్తాయి. సోమవారం వర్షం కురియ డంతో వ్యాపారులు పట్టలు కప్పుకుని ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది.
Updated Date - May 19 , 2025 | 11:42 PM