దంచి కొట్టిన వాన
ABN, Publish Date - May 30 , 2025 | 11:47 PM
రుతుపవనాల ప్రభావంతో పలు మండ లాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు వర్షం దంచికొట్టింది.
రోడ్లు జలమయం.. ఇబ్బందుల్లో జనం
వ్యవసాయ రైతులకు ఆనందం
మొక్కజొన్న రైతులు విలవిల
రాజుపాళెం/కొండాపురం, మే 30 (ఆంధ్రజ్యో తి) : రుతుపవనాల ప్రభావంతో పలు మండ లాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు వర్షం దంచికొట్టింది. దీంతో రహదారులు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజుపాళెం, కొండాపురం, దువ్వూరు, మైదుకూ రు తదితర మండలాల్లో వర్షం కురిసింది. కాగా రాజుపాళెం మండలంలో పంట పొలాలన్నీ పదను ఎక్కాయి. దీంతో ఖరీఫ్ పంటలు సాగు చేసుకునేందుకు సేద్యానికి అనుకూలంగా ఉం టుందని రైతులు తెలిపారు. అదే విధంగా బోర్ల కింద సాగు చేస్తున్న మొక్కజొన్నలు రోడ్లపై ఆరబెట్టుకున్న మొక్కజొన్నలు వర్షంతో తడవ డంతో కాస్త నిరాశపరిచింది. ఒక్కసారిగా వర్షం కురియడంతో కొంత మంది రైతులు పట్టలు కప్పుకోవడంతో పాటు మరికొంత మంది సకా లంలో వర్షంలో పోలేక తడిచిపోయాయి. ఏదిఏ మైనా మే నెలలో ముందస్తు వర్షాలు పడుతుం డడంతో ఖరీఫ్ పంటలకు ఇక ఢోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా కొండాపురంతో పాటు పలు గ్రామాల్లో వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల రోడ్లన్నీ బురదమ యమయ్యాయి.ఈ ఏడాది రుతుపవనాల ప్రభావం వల్ల వర్షాలు ముందుగానే కురుస్తుం డటంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొద్దిపాటి వర్షానికే జలమయంగా రోడ్లు
మైదుకూరు రూరల్ ,మే 30(ఆంధ్రజ్యోతి) : కొద్దిపాటి వర్షానికే రోడ్లు జలమయంగా మారి పోయాయి. మైదుకూరులో శుక్రవారం సాయం త్రం కురిసిన వర్షానికే నంద్యాల రోడ్డులోని పెద్దమ్మతల్లి ఆలయం వద్ద వర్షానికి మురుగు కాలువల్లో నీరు వీధుల్లోకి చేరి బురదమయం గా మారిపోయింది. అలాగే అనుకుంటలో వీ ధంతా మురికి కూపంలా మారిపోయింది. నంద్యాల రోడ్డులోని ప్రఽధాన రహదారుల్లో ము రుగు నీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది. ఇప్ప టికైనా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
దువ్వూరులో: దువ్వూరులో శుక్రవారం వర్షం పడింది. ఈ సమయంలో దారి వెంట నీరు ప్రవహించింది. చిన్నపాటి గుంతల్లో నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొంతమంది రైతులకు వాన ఇబ్బంది కలిగించింది. రోడ్ల వెంబడి కొన్ని ప్రాంతాల్లో వేరుశనక్కాయలను ఆరబెట్టగా వానదెబ్బకు అవి తడిశాయి. మరికొన్ని చోట్ల వేరుశనగ చెట్లను తొలగించారు. ఇలాంటి పొలాల్లో కాయలు తడిసి మోసులు వస్తాయనే ఆందోళన రైతులు వెలిబుచ్చుతున్నారు.
ఖాజీపేటలో: ఖాజీపేట మేజర్ పంచాయతీ పరిధిలో శుక్రవారం వర్షం కురిసింది. దీంతో పంచాయతీతోపాటు టీచర్స్ కాలనీలో రోడ్డుపై నీరు నిలిచి పాదచారులకు ఇబ్బందికరం గా మారింది.. అధికారులు వర్షపునీరు పోయేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - May 30 , 2025 | 11:47 PM