జూనియర్, డిగ్రీ కళాశాలల భవనాలకు భూమిపూజ
ABN, Publish Date - May 10 , 2025 | 11:21 PM
బి.కోడూరు, అట్లూరు మండలాల్లో శనివారం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల ల భవనాలకు బద్వేలు నియోజక వర్గ ఇనచార్జ్ రితీష్‌కుమార్‌రెడ్డి భూమిపూజ చేశారు.
బి.కోడూరు/అట్లూరు, మే 10 (ఆంధ్రజ్యోతి): బి.కోడూరు, అట్లూరు మండలాల్లో శనివారం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల ల భవనాలకు బద్వేలు నియోజక వర్గ ఇనచార్జ్ రితీష్‌కుమార్‌రెడ్డి భూమిపూజ చేశారు. బి.కోడూరు మండల పరిధిలోని కస్తూర్భాగాంఽధీ పాఠశాలలో జూనియర్ ఇంటర్ కాలేజీ నిర్మాణానికి. ఒక కోటీ 20లక్షల రూపాయలు మంజూరైనట్లు ఆయన తెలిపా రు. అక్కడికి వచ్చిన స్థానిక సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ వెంకట సుబ్బారెడ్డి మోడల్ స్కూలుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించి దాదాపుగా 15సంవ త్సరాలు అవుతుందని గతంలో ఇక్కడికి వచ్చిన మోడల్ స్కూలును ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి కాశినాయన మండలానికి తీసుకెళ్లారని కావున తమ మండలానికి మోడల్ స్కూలు ఏర్పాటు కృషి చేయాలని తెలిపారు. అలాగే కస్తూర్భాగాంఽధీ పాఠశాలలో వసతుల గురించి ప్రిన్సిపాల్ శ్రీలతారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బొజ్జ రోశన్న, మండల టీడీపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ఎల్‌ఎస్‌పీ ప్రాజెక్టు ఛైర్మన వెంకటరమణారెడ్డి, అమర్‌నాధరెడ్డి, శేషారెడ్డి, మాజీ జడ్పీటీసీ భూపాల్‌రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, రాఘవరెడ్డి, క్రిష్ణారెడ్డి, బాలలింగారెడ్డి, బాలయ్య పాల్గొన్నారు. అట్లూరు మండలంలోని అట్లూరు కస్తూర్బా గురుకుల పాఠశాల ప్రాంగణంలో రూ.2.12 కోట్లతో డిగ్రీ కాలేజీ భవనానికి బద్వేలు నియోజకవర్గం సమన్వయకర్త రితీష్‌రెడ్డి భూమిపూజ చేశారు. మూడు తరగతి గదులకు మూడు వసతి గృహాలకు రూ.2.12 కోట్లతో భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గుర్విరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైౖర్మన సూర్యనారాయణ రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు మల్లిఖార్జునరెడ్డి, మండల నాయకులు అరవ శ్రీనివాసులరెడ్డి, పాలకొండ రామచంద్రా రెడ్డి, పాలకొండు రాజశేఖర్‌రెడ్డి, జయక్రిష్ణారెడ్డి, లక్ష్మినరసారెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, నరసింహా రెడ్డి, ఎల్.రామక్రిష్ణారెడ్డి, ప్రత్యేక అధికారి ఫణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 10 , 2025 | 11:21 PM