ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మట్టికుండలకు మంచిరోజులు

ABN, Publish Date - May 05 , 2025 | 11:42 PM

వేసవి ఎండ లు మండుతుండడంతో చల్లని తాగునీటి కోసం జనం మట్టికుండలను వాడుతున్నారు.

మట్టికుండలు

ఫ్రిజ్‌లు ఉన్నా మట్టికుండల వైపు జనం చూపు ఆరోగ్యానికి శ్రేష్ఠమంటూ వాడుతున్న కుండలు ఊపందుకున్న విక్రయాలు

బద్వేలుటౌన, మే 5 (ఆంధ్రజ్యోతి) : వేసవి ఎండ లు మండుతుండడంతో చల్లని తాగునీటి కోసం జనం మట్టికుండలను వాడుతున్నారు. ప్రతి ఇం టా ఫ్రిజ్‌లు ఉన్నప్పటికి ఆరోగ్య రీత్యా మట్టికుం డలు మేలంటూ జనం ఆ దిశగా ముందుకె ళు తున్నారు. మట్టికుండ.. ఒకప్పుడు లేని ఇళ్లు ఉం డేది కాదంటే అతిశయోక్తికాదు. నీరు పట్టుకో వడానికి.. నీటిని నిల్వ ఉంచడానికి.. వంటలకు.. ఇలా అన్ని అవసరాలకు వాటిని వినియోగించే వారు. వంట పాత్రలను కూడా మట్టిపా త్రలనే వాడేవారు. కాలక్రమేణ వాటి ఉప యోగం తగ్గుతూ వచ్చింది. అయితే ఇటీ వల కాలంలో ప్రజలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాలే కాకుం డా పట్టణ ప్రాంతాల వారు సైతం మట్టికుండలను తాగునీటి కోసం వాడు తుండడంతో వాటి వినియోగం పెరిగి మట్టికుండలకు మంచిరోజులు వచ్చాయని పేర్కొంటున్నారు. మట్టికుండల్లో నీరు తాగి తే ఎంతో మేలు చేకూ రుతుందని వైద్యనిపుణులు పేర్కొంటుండడం ఇందు కు ప్రధాన కారణంగా నిలు స్తోంది. గొంతునొప్పి, జలు బు ఇతరత్రా వ్యాధులను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న పట్ట ణాలతోపాటు పెద్ద పెద్ద నగ రా ల్లో కూడా మట్టికుండలు, కూ జాల విక్రయాలు పెరుగుతు న్నాయి. ప్రస్తుత అవసరాలు, మా ర్పులకు తగ్గట్టుగా మట్టికుం డలకు నీటి కొళాయిలు బిగించి విక్రయిస్తుండడం గమనార్హం. ఒక్కొక్క కుండలో 10, 20, 30 లీటర్ల నీటి సామర్థ్యంతో ఉంటాయి. మట్టికుండలు రూ.200 నుంచి రూ.500 వరకు మార్కెట్లో ధరలు పలు కుతున్నాయి. అలాగే ఆలయ నిర్మాణంలోని విగ్రహ ప్రతిష్ఠకు ముంతలను అధికంగా విని యోగిస్తుండటంతో మట్టికుండలకు గిరికీ అద రోహో అనిపిస్తోంది.

Updated Date - May 05 , 2025 | 11:42 PM