జలగ రోగంతోనే మేకలు, గొర్రెలు మృత్యువాత
ABN, Publish Date - Apr 19 , 2025 | 11:30 PM
మండ లంలో మేకలు, గొర్రెలు జలగ రోగంతో చనిపో తున్నాయని పశువైద్యాధికారులు వెల్లడించారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
బి.కోడూరు, ఏప్రిల్ 19 (ఆంధ్ర జ్యోతి): మండ లంలో మేకలు, గొర్రెలు జలగ రోగంతో చనిపో తున్నాయని పశువైద్యాధికారులు వెల్లడించారు. ఇటీవల మేకలు, గొర్రెలు మెడవాపు, పొట్ట ఉబ్బరంతో చని పోతున్నాయని ‘ఆంధ్రజ్యోతి’లో శని వారకం ‘మూగరోదన.. రైతు ఆక్రం దన’ అనే శీర్షికన వార్తా కథనం ప్రచు రిత మైంది. ఇందుకు స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు బ్రహ్మంగారిమఠం డివిజన ఏడీఏ వెంకటసుబ్బయ్య, స్థానిక పశువైద్యాధికారి భరద్వాజక్రిష్ణతో కలిసి రెడ్డివారి పల్లె గ్రామానికి వచ్చి శనివారం వైద్య శిబిరం నిర్వహించి మేకలను, గొర్రెలను పరిశీలిం చారు. చనిపోతున్న మేకలు, గొర్రెలకు జలగ రోగం సంభవించిందని, దీనికి వైద్యం అందిస్తా మని, రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అలాగే మేకలు, రైతుల గొర్రెలకు మేపు, తాగునీటిపై అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సోమవా రం కూడా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తు న్నట్లు వారు తెలిపారు. ఈ సీజనలో ఈ జబ్బు రాకూడదని, కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల శ రీరంలో జలగల ఉత్పత్తి పెరిగి దీంతో చనిపోతున్నాయని, సరైన వైద్యం అందిస్తామని వారు తెలిపారు.
Updated Date - Apr 19 , 2025 | 11:31 PM