గిరీ్‌షరెడ్డి దాతృత్వం అభినందనీయం
ABN, Publish Date - Jul 16 , 2025 | 11:56 PM
తలమంచి చా రిటబుల్ ట్రస్టు ద్వారా సా మాజిక సేవా కార్యక్రమాలు, దాతృత్వాలు చేస్తున్న హైదరాబాదులో స్థిరపడిన పి.కొత్తపల్లె నివాసి తలమంచి గిరీ్‌షరెడ్డి దాతృ త్వం అభినందనీయమని పెనగలూరు ఎస్‌ఐ బి.రవిప్రకా్‌షరెడ్డి అన్నారు.
పెనగలూరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): తలమంచి చా రిటబుల్ ట్రస్టు ద్వారా సా మాజిక సేవా కార్యక్రమాలు, దాతృత్వాలు చేస్తున్న హైదరాబాదులో స్థిరపడిన పి.కొత్తపల్లె నివాసి తలమంచి గిరీ్‌షరెడ్డి దాతృ త్వం అభినందనీయమని పెనగలూరు ఎస్‌ఐ బి.రవిప్రకా్‌షరెడ్డి అన్నారు. తలమంచి చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.10 లక్షలతో పెనగలూరు పోలీసుస్టేషనను ఆధునీకరించామన్నారు. బుధవారం దాత గిరీ్‌షరెడ్డితో పాటు కొత్తపల్లె యూత సభ్యులకు ఎస్‌ఐ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పి.కొత్తపల్లె గ్రామ పెద్దలు ఆకుల చిన్న, మీగడ విశ్వనాథ్‌రెడ్డి, నరేంద్ర, జి.పెంచలయ్య, శివారెడ్డి, మస్తాన, మహబూబ్‌బాషా, అబ్బిరెడ్డి, రహమాన పాల్గొన్నారు.
Updated Date - Jul 16 , 2025 | 11:56 PM