ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మొక్కుబడిగా సర్వసభ్య సమావేశం

ABN, Publish Date - Jun 18 , 2025 | 11:20 PM

మూడు నెలలకు ఒక్కసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా జరుగుతోంది.

మాట్లాడుతున్న ఎంపీపీ రాజమ్మ

సుండుపల్లె, జూన18(ఆంధ్రజ్యోతి): మూడు నెలలకు ఒక్కసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా జరుగుతోంది. వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి స్థానిక ఎన్నికలు పూర్తి అయిన తర్వాత జరిగిన సర్వసభ్య సమావేశం నుంచి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సర్వసభ్య సమావేశంలో సమస్యలు పరిష్కరించిన పాపాన పోలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రాజమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచులు ఉదయం 10 గంటలకు సభకు హాజరు కావాల్సి ఉండగా మధ్యాహ్నం 12 గంటలకు హాజరయ్యారు. గత సమావేశంలో వివరించిన ఏ సమస్యకు పరిష్కారం చూపినట్లు ప్రస్తావించలేదు. పైగా కీలక పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన అధికారులు ఎవరూ సమావేశానికి హాజరు కాలేదు. మండల వ్యాప్తంగా పలు గ్రామ పంచాయతీల్లో తాగునీటి సమస్యలు ఉన్నాయి. ఆ శాఖకు సంబంధించిన అ ధికారులు హాజరుకాకపోవడం ఏమిటని ఎంపీపీ రా జమ్మ ప్రశ్నించారు. అంతేగాకుండా ఎంపీటీసీలు కూడా గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ఎన్నికలు లేకుం డా ఏకగ్రీవంగా చేసుకున్న వారు కావడంతో ప్రజా సమస్యలు ఉంటే మాకేంటి అనే ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. చిన్నగొల్లపల్లి సర్పంచ మి నహా సర్పంచులు ఎవరూ సమవేశానికి హాజరు కా లేదు. గత ప్రభుత్వంలో సమావేశాలు నిర్వహించారు కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న నిధులు ఏం చేశారో లెక్కలు చెప్పలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎంపీటీసీలను.. ‘మీరు రాకపోతే ఎలా ఖచ్చితంగా రండి, సంతకం పెట్టి పోండి’ అని బతిమలాడి మరీ సర్వసభ్య సమావేశానికి తీసుకొచ్చినట్లు సమాచారం. ప్రజాప్రతినిధులకు బాధ్యత లేకపోవడం ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు. ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ రెడ్డెమ్మ, విద్యాశాఖ అధికారులు వెం కటేశనాయక్‌, రవీంద్రనాయక్‌, వ్యవసాయశాఖ అధికారి మహబూబ్‌బాషా, ఏపీవో మాలిక్‌బాషా, ఉద్యాన శాఖాధికారిణి వనితాభాయి, వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 11:20 PM