సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలి: కలెక్టర్
ABN, Publish Date - Jul 26 , 2025 | 11:58 PM
సీజనల్ వ్యాధులపై దృష్టిల సారించాలని కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు.
రాయచోటి(కల్టెరేట్), జూలై26(ఆంధ్రజ్యోతి): సీజనల్ వ్యాధులపై దృష్టిల సారించాలని కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స హాల్‌లో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో స్వర్ణాంధ్ర పీ4, ఓటరు జాబితా సవరణ, పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారాలు, సంక్షేమశాఖల హాస్టళ్లు, పాఠశాలల ఆకస్మిక తనిఖీలు తదితర అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న అధికారులు, సిబ్బంది స్వర్ణాంధ్ర పీ4 కార్యక్రమంలో పాలు పంచుకుని పేదవారికి చేయూతనివ్వాలని సూచించారు. తాను 10 కుటుంబాలు, సంయుక్త కలెక్టర్ 10 కుటుంబాలను దత్తత తీసుకున్నామన్నారు. ఆ ప్రభుత్వ ఉద్యోగులందరూ వారికి తోచిన సహాయాన్ని చేయాలని సూచించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన, మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
Updated Date - Jul 26 , 2025 | 11:58 PM