ప్రొద్దుటూరు అభివృద్ధిపై ఫోకస్ పెంచాలి
ABN, Publish Date - May 17 , 2025 | 11:55 PM
ప్రొద్దుటూరు అభివృద్ధిపై అధికారులు ఫోకస్ పెంచాలని జిల్లా కలెక్టర్ చెరు కూరిశ్రీధర్, ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అధికారులకు సూచించారు.
కలెక్టరేట్‌లో ప్రొద్దుటూరు అభివృద్ధి పై అధికారుల సమీక్షలో కలెక్టర్
ప్రొద్దుటూరు , మే 17 (ఆంధ్రజ్యోతి) : ప్రొద్దుటూరు అభివృద్ధిపై అధికారులు ఫోకస్ పెంచాలని జిల్లా కలెక్టర్ చెరు కూరిశ్రీధర్, ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అధికారులకు సూచించారు. శనివారం కడప కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాలులో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ, కమర్షియల్ మార్కెట్ అభివృద్ధి , మాస్టర్ ప్లాన రోడ్ల విస్తరణ తదితర అభివృద్ధి పనులపైన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రొద్దుటూ రులో డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచేందుకు ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. జనాభా వివరాలతో పాటు విస్తీర్ణం, నిధులు ఏ మేరకు అవసర మౌతాయో అంచనాలు తయారు చేయాలన్నారు. ఓపెన తోపాటు అండర్ డ్రైనేజీ వ్యవస్ధను అభివృద్ధి పరచాల్సివుందన్నారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరులో నూతన మాస్టర్ ప్లాన ప్రకారం విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్లు, కాలువ నిర్మాణాలకు అండర్ డ్రైనేజీ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. వాటర్ సప్లయిని మెరుగు పరిచేందుకు కృషి చేయాలన్నారు. ఇరిగేషన ఛానల్స్ పై ఆక్రమణలు తొలగించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అతిధి సింగ్ , ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, తహ సీల్దారు గంగయ్య, మున్సిపల్ ఈఈ ప్రభాకర్‌దాస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి ఇరిగేషన, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - May 17 , 2025 | 11:55 PM