ఈ- వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు
ABN, Publish Date - Apr 19 , 2025 | 11:28 PM
ఎలకా్ట్రనిక్ వ్యర్ధాలతో పర్యావరణానికి పెద్ద ముప్పు వాటిల్లుతుం దని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు.
ప్రొద్దుటూరు , ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి) : ఎలకా్ట్రనిక్ వ్యర్ధాలతో పర్యావరణానికి పెద్ద ముప్పు వాటిల్లుతుం దని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు. శనివారం ‘స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఈ వేస్టు గురించి ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాన్ని మున్సిపల్ సిబ్బంది చేపట్టారు. ఈ సందర్బంగా కమిషనర్ మల్లికార్జున మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఈ వేస్టును మున్సిపాలిటీకి అంద జేయడం వలన రీసైకిల్ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు గంగయ్య, శానిటరీ ఇనస్పె క్టర్లు నూర్‌బాషా, సుబ్బరాయుడు, మెప్మా టీఈ మహా లక్ష్మీ, సీవోలు విమల ,రసూలమ్మ టీడీపీ పట్టణ మా జీ అధ్యక్షుడు ఘంటశాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వేస్ట్ ఎలక్ర్టానిక్ వస్తువులు ఇవ్వండి
మైదుకూరు రూరల్ ,ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి) : ప్రతి ఇంటిలోని వేస్ట్ ఎలక్ర్టానిక్ వస్తువులు ఇచ్చి పర్యా వరణాన్ని కాపాడాలంటూ అధికారులు నినాదాలు చేశారు. ‘స్వచ్ఛఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగం గా శనివారం మైదుకూరు మండల అభివృద్ధి కార్యాలయం నుంచి అధికారులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత గ్రంధాలయం భవనంలో ఈ వేస్ట్ ఎలక్ర్టానిక్స్ వస్తువుల సెంటర్‌ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులరెడ్డి, మెప్మా అధికారిణి కెజియా, తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగుంట్లలో: ఈవేస్ట్ నిర్వహణ సక్రమంగా చేయక పోతే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని కమిష నర్ శేషఫణి పేర్కొన్నారు. ఈ వేస్ట్ సేకరణ వాటి విని యోగంపై కమిషనర్ ప్రజలకు వివరించారు. శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఎర్రగుంట్లలో నిర్వ హించి ఎలక్రానిక్ వస్తువుల వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.
బ్రహ్మంగారిమఠంలో: స్వర్ణాంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర కార్య క్రమంలో భాగంగా శనివారం బ్రహ్మంగారిమఠం మం డల కేంద్రంలోని సోమిరెడ్డిపల్లె సచివాలయం-1లో పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా గృహాల్లో కాలం చెల్లిన ఎలకా్ట్రనిక్ వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పార వేయకుండా వాటిని గ్రామ సచివాలయాలకు అందిం చాలని తెలిపారు. రేకలకుంట్ల గ్రామ పంచా యతీలో ఇనఛార్జ్ ఈవోపీఆర్‌డి సురేశ ఆధ్వర్యంలో ఈవేస్ట్ ర్యా లీ చేపట్టారు. అనంతరం ఎంపీడీవో కార్యాల యంలో ఎంపీపీ వీరనారాయణరెడ్డి, ఎంపీడీవో వెంగ మునిరెడ్డి ఆధ్వర్యంలో ఎలక్ర్టానిక్ పరికరాలను సేకరించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
బద్వేలు, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆర్డీవో చంద్రమోహన పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శ్రమదానం నిర్వహించి పాఠశాల పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశను స్వచ్ఛాంద్రప్రదేశగా తీర్చిదిద్దేలా కృషిచేస్తామని అధికారులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి , ఎక్సైజ్ సీఐ సీతారామిరెడడ్డి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
స్వచ్ఛత సంకల్పంతో ముందుకెళ్లాలి
జమ్మలమడుగు, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ స్వచ్ఛత సంకల్పంతో ముందుకెళ్లాలని జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడి ్డ సూచించారు. శనివారం జమ్మలమడుగు పట్టణంలో ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. అలాగే మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఎస్‌హెచ్‌జీ సంఘాల మహిళలు ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
కాశినాయనలో: పరసరాలను పరిశుభ్రంగా ఉంచుట కు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఎంపీడీవో డాక్టర్ మైథిలీరెడ్డి పేర్కొన్నారు. శనివారం నర్సాపురంలో స్వచ్ఛ ఆంధ్ర.. స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడు తూ ఎలక్రికల్ వ్యర్థాలను ఎక్కబడితే అక్కడ పడే యరాదన్నారు. అనంతరం ప్రతిజ్ఞచేయించారు. కార్యక్ర మంలో సర్పంచ ఖాజావలి,ఎంఈవో నిర్మల, ఎంపీటీసీ గౌషియా తదితరులు పాల్గొన్నారు.
చాపాడులో: మండల కేంద్రమైన చాపాడులో శనివారం స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్‌పై అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఎంఈవో రవిశంకర్, ఈవోపీఆర్‌డీ క్రిష్ణవేణి, హెడ్మాస్టర్ మహ్మద్‌గౌస్, ఏవో రామానుజులు, గ్రామ సెక్రటరి శ్రీధర్‌బాబు, సీసీ సుబ్బరత్న, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 19 , 2025 | 11:29 PM